ప్రకృతి హెచ్చరిక
‘దుర్భర శీతల కాలం మధ్యలో/ రోదింప చేసే హిమ పవనాలు/ ఉక్కులా దృఢమై నిలిచిన ధరిత్రి/బండలా మారిన నీరు..’ అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్' సృష్టించిన బీభత్స నేపథ్యంలో ఇంగ్లిష్ రచయిత్రి క్రిష్టినా రోసెటి రాసిన ఈ చరణాలను వాతావరణ వేత్త ఒకరు గుర్తు చేసుకున్నారు.
‘దుర్భర శీతల కాలం మధ్యలో/ రోదింప చేసే హిమ పవనాలు/ ఉక్కులా దృఢమై నిలిచిన ధరిత్రి/బండలా మారిన నీరు..’ అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ సృష్టించిన బీభత్స నేపథ్యంలో ఇంగ్లిష్ రచయిత్రి క్రిష్టినా రోసెటి రాసిన ఈ చరణాలను వాతావరణ వేత్త ఒకరు గుర్తు చేసుకున్నారు. కెనడా మొదలుకొని అమెరికా మీదుగా మెక్సికో సరిహద్దు వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల పొడుగునా మంచు తుఫాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అనేక మంది మరణించారు. విద్యుత్ లేకపోవడంతో వెలుతురు లేదు, వెచ్చదనమూ లేదు. వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులలో కనీసం ఒకరికొకరు కనిపించనంత మంచు పొగ కమ్మేసింది. క్రిస్మస్ సెలవుల కాలంలో విందులు, వినోదాలు, పర్యటనలతో గడిపే అమెరికా సమాజం అల్లాడిపోయింది. సంబురాలు లేకపోగా బతుకే భారమయ్యే దారు ణ స్థితి. ప్రకృతి ప్రకోపిస్తే అల్ప మానవుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ అనుభవం చెబుతున్నది.
భూగోళంపై తాపం పెరిగితే రుతువులు గతి తప్పుతాయని తెలుసు. అతి తీవ్రమైన గాలులూ వానలూ వరదలు వస్తాయనీ, కార్చిచ్చులు రగులుతాయనీ మన అనుభవంలోకి ఇప్పటికే వచ్చింది. తరుచుగా ఉగ్ర తుఫానులు భీతి కొలుపుతూనే ఉన్నాయి. ఇవన్నీ మన స్థాయిలో మనం వేసుకున్న అంచనాలు. కానీ బాంబ్ సైక్లోన్ వంటి ఉగ్ర రూపాలు ఉంటాయనేది మరింత భీతి గొలుపుతున్నది. వాతావరణం వేడెక్కడం వల్ల మిగతా ప్రాంతాల కన్నా ఆర్కిటిక్ ప్రాంతం నాలుగు రెట్లు వేడిగా మారింది. అక్కడి శీతల గాలులు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఒక దృఢమైన పవన వలయం నిరోధిస్తుండేదనీ, కానీ వాతావరణ మార్పుల వల్ల ఈ వలయం బలహీనపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శీతల గాలులు దక్షిణానికి విస్తరించిన తదనంతర పరిణామాలే ఈ భీకర పరిస్థితికి దారి తీశాయి.
భూగోళం పైనున్న వాతావరణ వ్యవస్థలన్నీ అనుసంధానమై ఉంటాయి. ఒక చోట విచ్ఛిన్నమైతే ఆ ప్రభావం ఇతర వ్యవస్థలనూ ఆటంక పరుస్తుంది. అత్యంత పీడనం, అత్యల్ప పీడనం సంగమించిన ఫలితమే బాంబ్ సైక్లోన్ అని వాతావరణ వేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి తుఫానులు తరచు రావచ్చునని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి భీకర పరిస్థితులు ఏర్పడతాయో అంచనా వేయలేము. మానవాళి జీవనానికి సంబంధించిన విషయంలోనూ వివిధ దేశాల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమార్హం కాదు. ట్రంప్ వంటి కొందరు నాయకులైతే వాతావరణ మార్పులు అనే వాదననే కొట్టిపారేశారు. ప్రజలు జాగృతమై ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తే తప్ప అభివృద్ధి పేర సాగుతున్న విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. ‘బాంబ్ సైక్లోన్’ హెచ్చరికతోనైనా అప్రమత్తం కావాలి.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

