స్వేచ్ఛా వాయువుల పతాక
నా దేశ స్వాతంత్య్రం నూతన శకారంభం నా జాతి ఔన్నత్యం నవనవోన్మేషణం పరాయి పాలనకు నాడు చరమ గీతమాలపించి బానిస బ్రతుకులకు కొత్త భవితవ్యం కనుగొన్నాం.. మువ్వన్నెల బావుటాను ముచ్చటగా ఎగరేస్తూ చెదరని చిరునగవుతో జైహిందని నినదిస్తూ భారత మాతకు మంగళ హారతులర్పిస్తున్నాం..
నా దేశ స్వాతంత్య్రం నూతన శకారంభం
నా జాతి ఔన్నత్యం నవనవోన్మేషణం
పరాయి పాలనకు నాడు చరమ గీతమాలపించి
బానిస బ్రతుకులకు కొత్త భవితవ్యం కనుగొన్నాం..
మువ్వన్నెల బావుటాను ముచ్చటగా ఎగరేస్తూ
చెదరని చిరునగవుతో జైహిందని నినదిస్తూ
భారత మాతకు మంగళ హారతులర్పిస్తున్నాం..
రజతోత్సవ వేడుకలు, స్వర్ణోత్సవ సంబరాలు
పేదరికం మాటుననే పెను సవాళ్ళ బాటలపై
తరతరాల విధానాల తెర చాటు జీవితాలు
దరహాసం పులుముకుని సాగించాం..చాన్నాళ్ళు..
చిరకాలస్వప్నాలు సాకారం కావాలని
అరువదేండ్లు శ్రమించాం.. అరకొరగా మిగిలి పోయాం..
ఆనాటి ఆ కలలు ఏనాటికి నిజమౌనో
అనుకున్న తరుణంలో ఆశాకిరణం విరిసి
ఆశయం ఫలియించే అదృష్టం కలిగింది..
ఉదయించే సూర్యుడిలా ఉద్యమాల వీరుడిలా
తెలంగాణ సాధించే ధీరుడిలా ముందు నడిచి
బాపూ చూపిన బాటన పయనించిన మన బాపూ
కేసీఆర్ కృషి ఫలితం స్వేచ్ఛా వాయువులు వీచు
స్వరాష్ట్రం..సౌభాగ్యం..
రైతులు కళకళ లాడే రైతు బంధు పరిపాలన,
స్త్రీలకు చిరునవ్వొసగిన చరితాత్మక సంఘటన..
బందూకులు, అస్ర్తాలకు స్వస్తి పలికి నవయువత
సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనకవకాశం
నీటి కొరత తీరిపోయి కోటెకరపు మాగాణి
అభ్యుదయం నలుదెసల హరివిల్లై విరాజిల్లి
ప్రథమ స్థానంలో నిలిచిన ప్రత్యేక తెలంగాణ
ఇదికదా సర్వతంత్ర స్వాతంత్య్రపు కీర్తి..
ఇదేకదా నవ భారత వజ్రోత్సవ స్ఫూర్తి..
– శ్రీదేవి మంత్రి
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

