ఏ ఆర్థిక వ్యవస్థ అయినా గ్రోత్ ఇంజిన్‌గా మారడానికి కీలకం.. లావాదేవీల విస్తృతి. మిగతావాటికి భిన్నంగా ఆర్థిక వ్యవస్థ పనితీరు కొంత విచిత్రంగా ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇంధనము ధనమే. అది ఉత్పత్తి, చేసేదీ సంపదనే! ఎంత డబ్బును మార్కెట్ (సమాజం)లోకి ఇన్ఫ్యూజ్ చేస్తే, అంతకంటే ఎక్కువ సంపద సృష్టి జరుగుతుంది. ఎంత సంపదను సృష్టించగలిగితే, అంత డబ్బును ఇన్ఫ్యూజ్ చేసే అవకాశం దక్కుతుంది. ఇదొక చిత్రమైన ఆవర్తం. కేసీఆర్ హయాంలో సంపద పెంచే, నలుగురికీ పెంచే సృజనాత్మక విధానాల వల్ల ఈ ఆవర్తం వేగాన్ని అందుకున్నది. కానీ గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పథకాల నిలిపివేత లేదా అరకొర అమలు వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల మందగమనం చోటుచేసుకుని, గ్రోత్ ఇంజిన్ కుంటుపడింది. సైప్లె చైన్ సిస్టమ్ దెబ్బతిన్నది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంపై విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.
ఆ ప్రశ్నకు పదేండ్ల పాలనలో గణాంకాలే సమాధానంగా నిలిచాయి. 2013-14లో రూ.4.51 లక్షల కోట్లుగా ఉన్న GSP, 2023-24 నాటికి రూ.14.63 లక్షల కోట్లకు పెరిగి సుమారు 22.4% AAGR నమోదుచేసింది. తలసరి ఆదాయం రూ.0.95 లక్షల నుంచి
రూ.3.47 లక్షలకు పెరిగి సుమారు 26.4% AAGR వృద్ధిని సాధించింది.
evelopment is about expanding the real freedoms that people enjoy.
– Amartya Sen
మల్టిప్లయర్ ప్రభావం – ఒక రూపాయి ప్రయాణం
MPC (Marginal Propensity to Consume) మరియు Multiplier Effect ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ ఖర్చు ఎలా విస్తరిస్తుందో అర్థం చేసుకోవడానికి కీలకమైన సూత్రాలు. MPC అంటే అదనపు ఆదాయం వచ్చినప్పుడు దాంట్లో ఎంతభాగం వినియోగంపై ఖర్చవుతుందో సూచిస్తుంది. దీనిని సూత్రంగా ఇలా వ్యక్తీకరించవచ్చు:
MPC=
ఉదాహరణకు రూ.100 అదనపు ఆదాయంలో రూ.80 ఖర్చు చేస్తే MPC = 0.8.
Income increases lead to consumption increases.
– John Maynard Keynes
ఈ MPC ఆధారంగా Multiplier Effect ఏర్పడుతుంది. దానిసూత్రం: Multiplier=1/(1-MPC)
వాస్తవ ప్రపంచంలో పన్నులు, పొదుపులు, దిగుమతుల లీకేజీల వల్ల మల్టిప్లయర్ సాధారణంగా 1.5 నుంచి 2.5 మధ్యఉంటుంది. అంటే ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూ.100 చివరికి రూ.150 నుంచి రూ.250 వరకు ఆర్థిక విలువను సృష్టించే అవకాశం ఉంటుంది.

ఆసరా పింఛన్లు రూ.200 నుంచి రూ.1000, తర్వాత రూ.2000 వరకు పెంపుఇవి అత్యల్ప ఆదాయ వర్గాలకు నేరుగా డబ్బు చేరడంతో MPC సాధారణంగా 0.850.95 వరకు ఉంటుంది. అందువల్ల మల్టిప్లయర్ 1.82.3 వరకు చేరి గ్రామీణ వినియోగాన్ని వేగంగా పెంచుతుంది.
రైతుబంధు పథకం రూ.4000/ఎకరం నుంచి రూ.5000/ ఎకరానికి పెంపు- ఇది రైతుల చేతిలో నేరుగా నగదు పెంచి MPCని 0.750.85 మధ్యఉంచుతుంది. మల్టిప్లయర్ 1.52.0, ఇది గ్రామీణ మార్కెట్లను చురుకుగా ఉంచుతుంది.
గొర్రెల పంపిణీ, చేపల విత్తనాల వంటి పశు సంవర్ధక, మత్స్య పథకాలు కేవలం వినియోగాన్ని మాత్రమే కాదు – ఆస్తులను సృష్టించి, ఉపాధిని పెంచే ద్వంద్వ ప్రయోజనం కలిగిస్తాయి. వీటిలో MPC 0.60.8 ఉన్నప్పటికీ, ఆదాయం సృష్టి వల్ల మల్టిప్లయర్ ప్రభావం 1.82.2 వరకు పెరుగుతుంది.
వేతనాల పెంపు (73% ఫిట్మెంట్)లో MPC సాధారణంగా 0.80.9, మల్టిప్లయర్ 1.62.1 – ప్రతినెలా స్థిరమైన డిమాండ్‌ను సృష్టిస్తుంది.
ఇతరంగా, సబ్సిడీలలో MPC 0.50.7, అందువల్ల మల్టిప్లయర్ 1.21.5 మధ్య ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరోక్షంగా పెద్దఎత్తున డిమాండ్ పెట్టుబడులను సృష్టించి మల్టిప్లయర్‌ను 2.02.5 వరకు తీసుకెళ్తుంది.
మొత్తానికి, అధిక MPC ఉన్న వర్గాలకు డబ్బు వెళ్తే అది వెంటనే వినియోగంలోకి వెళ్లి ఒక multiplier chain reactionనుసృష్టిస్తుంది
ఆదాయం వినియోగం ఉత్పత్తి ఉపాధి పన్నులు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: ద్వంద్వ ప్రేరణ
ఆసరా + రైతుబంధు + గొర్రెల పంపిణీ + చేపల విత్తనాల పథకాలు కలిసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ + ఉత్పత్తి అనే రెండు ఇంజిన్లు అందించాయి.
irect transfers to rural households stimulate both demand and local production. -IMF
73% ఫిట్మెంట్ కేవలం ఉద్యోగుల సంక్షేమం కాదుఇది ప్రతినెలా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహించే స్థిరమైన డిమాండ్ ప్రవాహం.
క్యాపెక్స్ వలన వృద్ధి
నగదు వలన డిమాండ్
ఆస్తులు వలన ఉపాధి
వేతనాలు వలన స్థిర వినియోగం.
In the long run, investment drives productivity and growth.
-World Bank
ప్రస్తుత పరిస్థితి: విధాన ప్రభావం గత 2.5 సంవత్సరాల్లో ప్రజల చేతిలో డబ్బు పెరుగుదల లేకపోవడం గమనించాల్సిన అంశం. ఆసరా, రైతుమద్దతు, వేతనాల పెంపు వంటి కీలక అంశాలలో పెరుగుదల లేకపోతే వినియోగం తగ్గి, డిమాండ్ మందగిస్తుంది.
When demand weakens, growth inevitably slows.
– OEC
గడచిన రెండేండ్లలో GSP వృద్ధి: 10.7
తలసరి ఆదాయం వృద్ధి 10.5%
రెవెన్యూ రిసీప్ట్స్ : ఆర్థిక ఆరోగ్య సూచిక
2014-15లో రూ.51,041 కోట్లు 2023-24లో రూ.1,69,293 కోట్లు (సుమారు 23% AAGR)
కానీ 2024-25లో రూ.1,67,804 కోట్లు – రూ.1,489 కోట్లు తగ్గుదల (
State Own Tax Revenue (SOTR)
201415: రూ.29,288 కోట్లు.
202324: రూ.1,11,798 కోట్లు
31.3 % AAGR వృద్ధి
ప్రస్తుత పరిస్థితి
202425: రూ.1,09,233 కోట్లు
తగ్గుదల: రూ.2,565 కోట్లు = -2.3%
పాజిటివ్ గ్రోత్‌ను నెగిటివ్‌గా మార్చడం పురోగమనా? తిరోగమనా?
ముగింపు
Consumption is the sole end and purpose of all production. Adam Smith
ఆసరా పెన్షన్లు పెరగక పోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపు లేకపోవడం, రైతుబంధు వంటి నగదు బదిలీలు నిలిచిపోవడం వల్ల ఆర్థికవ్యవస్థలోకి వచ్చే డబ్బు ప్రవాహం గణనీయంగా తగ్గుతున్నది. ఇదే సమయంలో గొర్రెల పంపిణీ, చేపపిల్లల విడుదల వంటి ఆస్తిసృష్టి పథకాలు కూడా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ సృష్టి అవకాశాలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ తగ్గి, చిన్నవ్యాపారాలు, సేవారంగం, రోజువారీ ఉపాధిపై ఆధారపడే వర్గాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఒకప్పుడు కేసీఆర్ పాలనలో ఆర్థిక చక్రం గిరగిరా తిరిగేది జీతాలు, పథకాలు, పెట్టుబడులు కలిసి ప్రతి రూపాయి మార్కెట్లో తిరిగి తిరిగి పనిచేసేది. కానీ ఇప్పుడు అదే చక్రం మందగించింది. ప్రజల చేతిలో డబ్బు లేకపోతే వినియోగం పడిపోతుంది; వినియోగం పడిపోతే వ్యాపారం తగ్గుతుంది; వ్యాపారం తగ్గితే ఉపాధి తగ్గుతుంది. ఈ చైన్ రియాక్షన్ వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా సహజంగానే తగ్గుతుంది.
రాబడులు తగ్గుతుండగా, రైతుల నుంచి ఉద్యోగుల వరకు, చిన్న వ్యాపారుల నుంచి కార్మికుల వరకు అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరుగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితులకు కారణం ఇదే. ఆర్థిక చక్రాన్ని నడిపే నిర్ణయాలు లేకపోతే, సంక్షేమం కూడా నిలకడగా ఉండదు. డబ్బు.. ప్రజల చేతుల్లోకి వెళ్లి, తిరిగి ఆర్థికవ్యవస్థలో చలనం సృష్టించకపోతే, అభివృద్ధి మందగించడం మాత్రమే కాదు, ప్రజల్లో నమ్మకం కూడా దెబ్బతింటుంది.
– పెండ్యాలమంగళాదేవి