జూబ్లీహిల్స్ : యూసుఫ్ గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్‌లో విజయదశమి దసరాను పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రథమ పటాలం కమాండెంట్ అనూప్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ఆయుధ పూజ, వాహనాల పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కె.వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు జి.రాజు, కె.సంపత్‌కుమార్ రెడ్డి, జె.రాందాస్, బి.జవహర్లాల్, ఆర్ఐలు ఎ.నరసింహ, డి.ధర్మారావు, ఎస్.సురేష్, టి.సాంబయ్య, ఎండి.జాఫర్, ఆర్.శంకర్, ఆర్ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.