Poster launch | వాయిస్ డబ్బింగ్.. వాయిస్ ఓవర్ శిక్షణా వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

రవీంద్రభారతి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో తెలంగాణ థియేటర్, మీడియా రిపోర్టరీ, తెలంగాణ వాయిస్ స్టూడియో వారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతున్న 45 రోజుల వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్ వాయిస్ ఓవర్ శిక్షణా శిబిరం కార్యక్రమం సీజన్-3కి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను బుధవారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రవీంద్రభారతిలోని తన ఛాంబర్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ నాటక రంగంలో శిక్షకుడుగా ఎంతో అనుభవం ఉన్న రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు రావడం చాలా గొప్ప విషయమని, ఓటీటీ సినిమాలు విడుదల అవుతున్న నేటి కాలంలో డబ్బింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు ఎన్నో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
డబ్బింగ్, వాయిస్, ఓవర్, వాయిస్ యాక్టింగ్లను నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఈ ఆన్లైన్ వర్క్‌షాప్ చాలా చక్కని అవకాశం అని, గత రెండు సీజన్లలాగే ఈ సీజన్3 కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు మామిడి హరికృష్ణ చెప్పారు. డబ్బింగ్, వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓవర్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 10 లోగా 7396817623 నెంబర్‌కి కాల్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని రమేష్‌గౌడ్ తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

