Crime | ఇద్దరు బాలనేరస్థుల అరెస్టు

బడంగ్‌పేట : ఇద్దరు బాలనేరస్తులు పట్టుబడ్డ సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నందనవనంలో నివాసం ఉండే ఇద్దరు బాలనేరస్తులు డమ్మీ పిస్తోల్ చూపించి అమాయక ప్రజల నుంచి పోన్లు, డబ్బులు లాకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందం వలపన్ని నందన వనంలో ఉన్న బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చిన డబ్బుతో సినిమాలు చూడటం, కొత్త బట్టలు కొనుక్కోవడం చేస్తున్నారని ఆయన తెలిపారు. పగటి సమయంలో కాలనీలలో తిరుగుతూ తాళాలు వేసిన ఇంటిని ఎంచుకుంటారని అన్నారు. వారిపై మీర్‌పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయినట్లు ఆయన తెలిపారు.
జూవైనల్లో ఉండి వచ్చినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దారి వెంట పోతున్న వారికి డమ్మీ పిస్తోల్‌ను చూపించి బెదిరస్తున్నారని ఆయన అన్నారు. బాల నేరస్తుల నుంచి రూ.25000వేలు, ఒక డమ్మీ పిస్తోలు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాల నేరుస్తులను అన్ బ్లే జూవైనల్ జస్టిస్టు బోర్డు ముందు హజరుపరిచినట్టు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

