Missing | బయటకు వెళ్లిన వృద్ధుడు అదృశ్యం

కార్వాన్ : ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన ఓ వృధ్దుడు అదృశ్యమైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం డి.జంగయ్య (89).. ఇతను గత 12 ఏండ్లుగా హీరానగర్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. జంగయ్య కూతురు సుజాత కార్వాన్లో నివసిస్తుంది.
తండ్రి దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. కాగా అక్టోబర్ 27 న ఇంట్లో నుండి వెళ్ళిన జంగయ్య తిరిగి రాలేదు. ఈ క్రమంలో జంగయ్య కూతురుతో పాటు జంగయ్య మనవడు డి. నర్సింహులు కలిసి తెలిసినవారందరి వద్దకు వెళ్ళి వెతికినప్పటికి అచూకీ లభించలేదు.
దీంతో కుటుంబ సభ్యులు టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వృధ్దుడు జంగయ్య ఆచూకి వివరాలు తెలిసినవారు టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ 04027854775లో గాని 8978334452 నెంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

