Suicide | పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

బంజారాహిల్స్ : పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 7లో నివాసం ఉంటున్న టి.ప్రవీణ్ (30) జిరాక్స్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
రెండేండ్లుగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా ఆర్థికంగా నిలదొక్కుకోలేదన్న కారణంతో కుదరడం లేదు. దీంతో గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవడంతో పాటు మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ నేపధ్యంలో ఈనెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరుసటిరోజు ఇంటికి వచ్చిన తల్లి చంద్రకళ చూడగా కొడుకు మృతదేహం కనిపించింది. ఈ మేరకు మృతుడి సోదరుడు బాల్కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

