ఆర్కేపురం : సంఖ్య శాస్త్రంలో ప్రతిభ కనబర్చిన హర్షవర్ధన్‌కు నటుడు సోనుసూద్ జ్ఞాపికను అందజేసి, ప్రోత్సహించారు. సోనుసూద్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్న హర్షవర్ధన్ మాట్లాడుతూ భారత దేశం గర్వించదగ్గ రియల్ హీరో సోనుసూద్ అని పేర్కొన్నారు.
సోనుసూద్ పుట్టిన తేది ఆధారంగా ఆయన పుట్టిన తేదిని సంఖ్య శాస్త్రంలో హరిస్కోప్(గణించి) చేసి సోనుసూద్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. అందుకు ముగ్దుడైన సోనుసూద్ హర్షవర్థన్‌ను అభినందిస్తూ జ్ఞాపికను అందజేశారన్నారు. సోనుసూద్ నుంచి జ్ఞాపికను అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.