బంజారాహిల్స్ : సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న సత్యనారాయణను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆయనకు సెప్టిక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గన్ ఫెల్యూర్ అయ్యాయని, ప్రస్తుతం ఐసీయులో వెంటిలేటర్‌పై వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులు బులెటిన్‌లో పేర్కొన్నారు. విషయం తెలు సుకున్న పలువురు సినీ ప్రముఖులు కైకాల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.