Pahadi shareef | నిధులు కేటాయించాలని మంత్రి సబితకు వినతి

పహాడీషరీఫ్ : పహాడీ షరీఫ్ మున్సిపాలిటీలోని 18వ వార్డులో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని వార్డు కౌన్సిలర్‌తోపాటు పలువురు వార్డు ప్రజలు మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని 18వ వార్డు కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ, వార్డు వాసులు బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. న్యూ బృందావన్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దానితో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.కాగా ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని మున్సిపల్ కమిషనర్ జి.పి కుమార్‌కు పోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారని కౌన్సిలర్ తెలిపారు.
అలాగే శ్రీరామకాలనీ నుంచి రామాలయం వరకు బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు రూ. 60 లక్షల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వాసుబాబు, చెన్నం రాజేశ్, గుండు నర్సింగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

