Calendar launch | పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
అంబర్‌పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం రూపొందించిన క్యాలెండర్‌ను సోమవారం ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌లు ఆవిష్కరించారు.
అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం రూపొందించిన క్యాలెండర్‌ను సోమవారం ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
పద్మశాలీలు ఐక్యంగా హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న పద్మశాలీల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, అంబర్‌పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎనుగంటి నరేందర్, ఉపాధ్యక్షులు పుట్ట పాండురంగయ్య, ఎ.అంజయ్య, పగిడిమరి హరి, చిలుక శివ్‌కుమార్, ఎస్.నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి వర్కాల కృష్ణ పాల్గొన్నారు.
ఇంకా కార్యదర్శులు జి.సత్తయ్య, చిప్ప శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్, టి.నరేందర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు కె.గట్టయ్య, కె.శ్రీనివాస్, పి.మధుసూధన్, కె.శ్రీకాంత్, కోట వెంకటేశ్, పి.దామోదర్, డీడీ అండ్ సీఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, గంజి వెంకటరమణ, దూస సత్యనారాయణ, వనం రమణ, కాశి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

