హఫీజ్‌పేట్ : గ్లోబల్ మోషన్పిక్చర్స్ సమర్పణలో మాన్సీమూవీస్ పతాకంపై జి. పాండురంగారావు, పులిఅమృత్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఖేల్. ఆర్. శరత్‌కుమార్‌ను దర్శకునిగా పరిచయంచేస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా, స్నేహల్ కామత్, మమత, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇతర పాత్రల్లో వెంకట్బోనాల, రమేష్, మోహన్‌గౌడ్, మరిసాయికిరణ్రెడ్డి, కార్తికేయరెడ్డి నటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మదీనగూడలోగల తెలంగాణ సినిమారచయితల సంఘం ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన వేడుకలో దర్శకనిర్మాత, రచయిత పులిఅమృత్ చేతులమీదుగా ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేశారు.
ఈ సినిమాకు సంగీతం ఆనంద్ అవసరాల, పాటలు వంశీకృష్ణ, నాగిరెడ్డి లింగారెడ్డి, గానం సాకేత్సాయిరాం, పులి అమృత్, ఆనంద్అవసరాల, సౌమ్య ఆలూర్, కెమెరా అమర్నాధ్, నిర్మాతలు జి పాండురంగారావు, పులి అమృత్, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శరత్‌కుమార్. సెన్సార్ పూర్తయిన ఖేల్ సినిమాను అక్టోబర్ చివరివారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.