శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, కర్టెన్ కాల్ థియేటర్ల సంయుక్త అధ్వర్యంలో గచ్చిబౌలిలోని గంగ్భూమిలో ఏర్పాటుచేసిన 40 రోజుల యాక్టింగ్ వర్క్ షాప్‌ను మంగళవారం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభించారు.
విద్యార్థులు యాక్టింగ్‌లో మెళుకువలు నేర్చుకునేందుకు అ వర్క్‌షాప్ ఎంతగానో దోహాదపడుతుందని, అ అవకాశాన్ని యాక్టింగ్‌పై ఆసక్తి కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
బట్టల రామస్వామి సినిమా హిరో ఆల్తాఫ్ హాసన్, దర్శకుడు సాయికృష్ణ, యాక్టింగ్ ట్రైనర్లు సురభి రమేష్, శ్రీనివాస్ రావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.