ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో వచ్చే నెల 1 నుంచి మరో బ్యాచ్ తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’ పేరుతో నిర్వహించే రెండు నెలల కోర్సుకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక బ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఈ నెల 30 లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫీజును డీడీ ద్వారాగానీ, ఆన్లైన్ పేమెంట్ ద్వారా గానీ స్వీకరిస్తామన్నారు. ఇతర వివరాలకు 9014500509, 9908213364 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.