Hyderabad | నిరుపేద కుటుంబానికి ‘ఆశ్రి’ ఆపన్నహస్తం…

హఫీజ్‌పేట్ : కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న ఆశ్రి ఫౌండేషన్ మరో కుటుంబానికి అండగా నిలిచింది. ఇంటి పెద్దను కోల్పోయిన ఓ కుటుంబానికి అమ్మలా ఆదుకుంది. హఫీజ్‌పేట్‌కు చెందిన ఓ నిరుపేద ముస్లీం కుటుంబానికి ఆశ్రి సొసైటీ ఆపన్నహస్తం అందించి మానవత్వం చాటుకున్నది. నలుగురు ఆడపిల్లలున్న ఆకుటుంబంలో ఇంటికి పెద్దదిక్కు గా ఉన్న తండ్రిని ఇటీవలే కోల్పోవడంతో తీవ్రకష్టాల్లో కూరుకుపోయింది.
అద్దెఇంటిలోఉంటున్న వీరు కనీసం తినేందుకు తిండికూడాలేక ఆకలితో అల్లాడుతూ ఏమీతోచని దయనీయస్ధితిలో కాలంవెల్లదీస్తున్నారు. తండ్రి చనిపోవడంతో తల్లి ఇళ్లల్లో పాచిపనిచేసి పిల్లల్ని పోషిస్తున్నది. నలుగురు ఆడపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆకుటుంబ ధీనగాధ ఆశ్రి సొసైటీ ఫౌండర్ ప్రపూర్ణరెడ్డి దృష్టికివచ్చింది. వెంటనే స్పందించిన ఆమె మంగళవారం నెలకు సరిపడా నిత్యవసరసరుకులను అందజేసి మానవత్వం చాటుకున్నారు.
అదేవిధంగా ఉపాధికల్పించాలని ఆ కుటుంబం కోరగా వెంటనే స్పందించి కుట్టుమిషన్‌ను సమకూర్చారు. భవిష్యత్తులో ఆకుటుంబానికి అన్నివిధాలా ఆశ్రి సొసైటీ తరపున సహయంచేసి ఆదుకుంటామని ప్రపూర్ణ పేర్కొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

