అధికారులు అప్రమత్తంగా ఉండాలి

రాత్రి కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి
ప్రతి ఫిర్యాదుదారుడికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి
టీబీ, అస్తమా ఉన్న వారికి విధుల నుంచి వెసులుబాటు
50 ఏండ్లు పైబడిన వారు స్టేషన్ల్లో షిఫ్టుల వారీగా విధులు
ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట, ఏప్రిల్ 22 : కరోనా వైరస్ బారిన పడకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉం టూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ చేత న సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న కారణంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో సి బ్బందిని థర్మల్ స్క్రీనింగ్ మిషన్స్, పల్స్ మీటర్లతో చెక్ చే స్తూ ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలన్నారు. పోలీస్ స్టే షన్కు వచ్చే ఫిర్యాదుదారుడికి స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలన్నారు. జిల్లా మెడికల్ ఆఫీసర్లతో పోలీసులకు కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రతిఒక్క రూ డాక్టర్ల సలహాలు పాటించాలన్నారు.
రోగ నిరోధక శక్తి పెరుగడానికి విటమిన్ సీ ట్యాబ్లెట్స్, నిమ్మ, బత్తాయి, ఆరెంజ్ పండ్లను తరచుగా తీసుకోవాలన్నారు. టీబీ, అస్తమా ఉన్న సిబ్బందికి విధుల నుంచి వెసు లు బాటు కల్పించామని, 50 ఏండ్లు పైబడిన వారు స్టేషన్లోనే షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి, పిటీషన్లను కైంప్లెంట్ బాక్సుల్లో వేయించాలన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

