బండ్లగూడ : భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో భర్త భార్యపై బ్లేడుతో డాడి చేసిన సంఘటన అత్తాపూర్ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..
సులేమాన్ నగర్లో నివాసం ఉండే సయ్యద్ మాజీద్ తన భార్య సమీరా బేగంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం రాత్రి భార్య భర్తల మధ్య గోడవ జరిగింది. దీంతో భర్త కోపంతో బ్లేడ్‌తో భార్యపై డాడి చేశాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు మాజీద్‌ను అదుపులోకి తీసుకుని సమీరాను ఉస్మానియా అస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.