TTD | శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఆర్జిత సేవా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ డిప్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. ఇంతకు ముందు ఆయా సేవలకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయనున్నదో.. ఆయా తేదీలను వేర్వేరుగా ప్రకటించేది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ డిప్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. ఇంతకు ముందు ఆయా సేవలకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయనున్నదో.. ఆయా తేదీలను వేర్వేరుగా ప్రకటించేది. తాజాగా ఒకేసారి క్యాలెండర్ను ప్రకటించింది. ఈ మేరకు భక్తులు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని.. సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఎలక్ట్రిక్ డిప్ : జూలై మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ 22న ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్ అలాట్మెంట్ను ప్రకటించనున్నట్లు పేర్కొంది.
ఆర్జిత సేవలు : జూలై మాసానికి సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సహా తదితర ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 20న ఉదయం 11.30 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనున్నట్లు చెప్పింది.
అంగ ప్రదక్షిణం : జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది.
వర్చువల్ సేవలు : మే, జూన్ మాసాలకు సంబంధించి వర్చువల్ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం : మే మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
వసతి గదులు : మే నెలకు సంబంధించి తిరుమలలో వసతి గదుల కోటాను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీడీపీ వెల్లడించింది. 27న తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

