రామచంద్రుడితడు.. షోడశ గుణధాముడు
రామచంద్రుడితడు.. షోడశ గుణధాముడు కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః॥
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః॥
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః
విద్వాన్ కః కః సమర్థశ్చ కచ్చ ఏక ప్రియదర్శనః॥
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే॥
విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ, మహనీయమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఉత్తమ కుమారుడిగా, ఆదర్శ సోదరుడిగా, ధర్మ స్వరూపి అయిన భర్తగా, జీవకారుణ్య స్ఫూర్తిగా, అరణ్య జీవన రక్షకుడిగా, అధర్మ విదార శక్తిగా, అయోధ్య పాలకుడిగా, స్నేహబాంధవుడుగా, స్మిత పూర్వక సంభాషణా విన్నాణ మూర్తిగా, ధర్మాన్ని, సత్యాన్ని ఆలంబన చేసుకుని, అవనీ సంచారాన్ని ఆనంద గీతికగా ఆవిష్కరించిన పురుషోత్తముడు రాముడు! దశావతారాలలో ఏడోదిగా, నక్షత్ర మాలలోనూ ఏడోది అయిన పునర్వసు పుణ్యరాశిగా ఆరాధనీయుడి అవతరణ రాముడు.
మర్యాదపురుషోత్తమునిగాలోకం మన్ననలు అందుకున్న రామచంద్రమూర్తిలో ఉన్న షోడశ (16) సుగుణాలను వాల్మీకి మహర్షి రామాయణంలో ఇలా పేర్కొన్నాడు..
1.గుణవంతుడు..
మంచి గుణాలు కలిగినవాడు
2.వీర్యవంతుడు..
ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు
3.ధర్మజ్ఞుడు..
ధర్మంతెలిసినవాడు
4.కృతజ్ఞుడు..
చేసిన మేలు మరవనివాడు
5.సత్యవాక్యపరిపాలకుడు..
సత్యం మాత్రమేపలికేవాడు
6.దృఢవ్రతుడు..
నిశ్చయబుద్ధి కలిగిన వాడు, పట్టిన పట్టు వదలనివాడు
7.చరిత్రవంతుడు..
ఉత్తమ ప్రవర్తన కలిగినవాడు
8.సర్వభూత హితుడు..
ప్రాణులన్నిటి క్షేమం కోరేవాడు
9.విద్వాంసుడు..
శాస్త్రపాండిత్యంమిక్కుటంగా ఉన్నవాడు
10.సమర్థుడు..
ఏ పనినైనా సాధించగల సామర్థ్యం కలవాడు
11.ప్రియదర్శనుడు..
అందరికీ చూడముచ్చటైనవాడు
12.ఆత్మవాన్..
ధైర్యం, ఆత్మనిగ్రహం కలిగినవాడు
13.జితక్రోధుడు..
కోపాన్ని జయించినవాడు
14.ద్యుతిమంతుడు..
తేజస్సు, కాంతికలిగినవాడు
15.అనసూయకుడు..
అసూయ లేనివాడు
16.బిభ్యతి దేవశ్చ..
కోపిస్తే దేవతలు కూడా భయపడతారు
ఇవండీ రాముడి సుగుణాలు. సకల సుగుణాలనూ కలిగి ఉన్నందునే, అందాల రాముడు అందరికీ దేవుడయ్యాడు. మనిషిగా అవతరించి.. అవతారమూర్తిగా ఎదిగాడు. దైవమై యుగాలుగా పూజలు అందుకుంటున్నాడు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

