నిజమైన అలంకారం
మనిషికి వస్త్రం కేవలం శరీరాన్ని కప్పే పొర కాదు, అది అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే నిశ్శబ్ద భాష. ‘భయభక్తులు ఉట్టిపడే దుస్తులే అన్నిటికన్నా మిన్న’ అన్న ఖురాన్ సందేశం.. బాహ్య అలంకరణ కంటే అంతర్గత వినమ్రతకే ప్రాధాన్యమిస్తుంది.
మనిషికి వస్త్రం కేవలం శరీరాన్ని కప్పే పొర కాదు, అది అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే నిశ్శబ్ద భాష. ‘భయభక్తులు ఉట్టిపడే దుస్తులే అన్నిటికన్నా మిన్న’ అన్న ఖురాన్ సందేశం.. బాహ్య అలంకరణ కంటే అంతర్గత వినమ్రతకే ప్రాధాన్యమిస్తుంది. వస్త్రధారణలో ఆడంబరం అహంకారాన్ని పెంచితే, నిరాడంబరత దైవానికి దగ్గర చేస్తుంది. హదీసుల ప్రకారం, పవిత్రతకు చిహ్నమైన తెల్లని వస్త్రం ధరించడం అత్యంత శ్రేష్ఠం. పురుషులు పట్టు వస్ర్తాలకు, గర్వాన్ని ప్రదర్శించే సుదీర్ఘ దుస్తులకు దూరంగా ఉండాలని, కాలి గిలకల పైకే వస్ర్తాన్ని ధరించాలని ఇస్లాం బోధిస్తున్నది.
ఇది కేవలం పద్ధతి మాత్రమే కాదు, అల్లాహ్ పట్ల చూపే అణకువ. స్త్రీల వస్త్రధారణలో గౌరవం, పురుషుల ప్రవర్తనలో వినయం ప్రతిబింబించినప్పుడే ఆ సమాజం ధర్మబద్ధంగా ఉంటుంది. వాహనాలపై క్రూర మృగాల చర్మాలను వాడకూడదన్న ఆదేశం జీవకారుణ్యాన్ని సూచిస్తే, మరణానంతరం శవపేటికలోనూ తెల్లని వస్త్రమే తోడు రావడం మనిషి అంతిమ నిరాడంబరతను చాటుతుంది. గుర్తుంచుకోండి.. వస్త్రం శరీరాన్ని అందంగా చూపడమే కాదు, మనసులోని గర్వాన్ని అణచివేసి దైవచింతనను పెంచేదిగా ఉండాలి. వినమ్రతే నిజమైన అలంకారం.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

