తాళం చెవి
పట్టణంలో బాగా జన సమ్మర్దమున్న ప్రదేశం అది. అక్కడ తాళాలు మరమ్మతు చేసే చిన్న అంగడి ఉంది. అందులోని యువ గుమాస్తాకి ఆశ ఎక్కువైంది. తన మిత్రులు దండిగా సంపాదించి జల్సాలు చేసుకుంటున్నారని బాధగా ఉండేది. యజమానిని మోసగిస్తే తన సంపాదన పెరుగుతుందని, జీవితం ఆనందమయం అవుతుందని భావించాడు.
- కథాసుధ
పట్టణంలో బాగా జన సమ్మర్దమున్న ప్రదేశం అది. అక్కడ తాళాలు మరమ్మతు చేసే చిన్న అంగడి ఉంది. అందులోని యువ గుమాస్తాకి ఆశ ఎక్కువైంది. తన మిత్రులు దండిగా సంపాదించి జల్సాలు చేసుకుంటున్నారని బాధగా ఉండేది. యజమానిని మోసగిస్తే తన సంపాదన పెరుగుతుందని, జీవితం ఆనందమయం అవుతుందని భావించాడు. అప్పుడే పట్టణ పొలిమేరల్లో ఉన్న ఆశ్రమం వంట గది తాళం చెవి పోయిందని ఓ వ్యక్తి వచ్చాడు. దాన్ని ఎలాగైనా తెరవమని అడిగాడు. ఆ పని చేసి పెట్టిరమ్మని అంగడి గుమాస్తాను పురమాయించాడు యజమాని. ఆ రోజునుంచే అదనపు ఆదాయం ప్రణాళికను అమలు చేయాలకున్నాడు గుమాస్తా. అందుకని ఒక ఆలోచన చేశాడు. తాళం తెరిచేట్లు చేసి ఆశ్రమం వారి వద్ద రెండు వందల రూపాయలు సేకరించి, యజమానితో వందే ఇచ్చారని అబద్ధం ఆడాలనుకున్నాడు. వంద తన సొంత ఖర్చులకు వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
అవసరమైన వస్తువులన్నీ తీసుకుని సైకిల్ మీద సర్రుసర్రున ఆశ్రమం చేరాడు. వంటగది ముందు నిర్వాహకులు, శిష్యులు గుంపుగా చేరి ఉన్నారు. గుమాస్తా తన దగ్గర ఉన్న తాళం చెవులతో తాళాన్ని తెరవడానికి శతవిధాల ప్రయత్నించాడు. వీలు కాలేదు. గది తెరవడం ఆలస్యమైతే భోజనం తయారీ ఆలస్యం అవుతుందని నిర్వాహకులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దాంతో తాళాన్ని పగలగొట్టడం మొదలు పెట్టాడు గుమాస్తా. అప్పుడే వచ్చిన ఆశ్రమ గురువు ‘శిష్యులారా… బాగా చూడండి… తాళం తనను పగులగొట్టినా భరిస్తుంది కానీ, వేరే తాళం చెవితో తెరుచుకోలేదు. అలాగే నీతి, నిజాయతీ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. తమ సహజ స్వభావాన్ని వదులుకోరు. లౌకిక వ్యవహారాల్లో మనల్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటి వ్యామోహంలో పడకండి. మంచిగా నడుచుకోండి’ అని హితబోధ చేశాడు. గురువు మాటలకు శిష్యులు ‘అలాగే’ అన్నట్లుగా తలలూపారు. అంతా విన్న గుమాస్తాకి గురువు చెప్పిన మాటలు సూటిగా తగిలాయి. తను చేసిన ఆలోచన తప్పని తెలుసుకున్నాడు. తాళం పని పూర్తి చేశాడు. వారిచ్చిన రెండు వందలు అలాగే తీసుకెళ్లి యజమాని చేతికిచ్చాడు.
…? ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Katha Sudha
- Read Story
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

