Chintana News | కన్నీటి పాఠాలు.. నలుగురిలో ఏడ్వడం కన్నా ఏకాంతంలో కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది!
గుండె బాధతో బరువెక్కితే కన్నీళ్లు ఆగవు. దుఃఖ పీడితుల కండ్లలోంచి రాలే అశ్రువులు ముత్యాల కన్నా విలువైనవి. రెండు కన్నీటి బిందువుల విలువకు ప్రపంచంలో ఏదీ సరితూగదు. అశ్రువులు మౌన ప్రార్థన అంటారు పెద్దలు. కన్నీళ్లు మాట్లాడుతాయి కానీ, వాటికి భాష లేదు.
Chintana News | గుండె బాధతో బరువెక్కితే కన్నీళ్లు ఆగవు. దుఃఖ పీడితుల కండ్లలోంచి రాలే అశ్రువులు ముత్యాల కన్నా విలువైనవి. రెండు కన్నీటి బిందువుల విలువకు ప్రపంచంలో ఏదీ సరితూగదు. అశ్రువులు మౌన ప్రార్థన అంటారు పెద్దలు. కన్నీళ్లు మాట్లాడుతాయి కానీ, వాటికి భాష లేదు. దీన్ని అల్లాహ్ మాత్రమే వినగలుగుతాడు. దుఃఖంతో పొంగే కన్నీరుతో మనసు తేలికవుతుంది. ఎంత కష్టమున్నా నలుగురిలో ఏడ్వడం కన్నా… ఏకాంతంలో కన్నీళ్లు పెట్టుకోవడం మంచిదంటారు పెద్దలు. తన ప్రేమలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టూ అల్లాహ్‌కు ప్రియమైనదని చెబుతారు. మన కన్నీళ్లను మనమే తుడుచుకుంటే దృఢ సంకల్పం అలవడుతుందని పెద్దల మాట. మన కన్నీళ్లను ఎదుటివారు తుడవాలి అనుకోవడం బలహీనతకు నిదర్శనం. మీ గుండె భరించలేని దుఃఖాలు, కష్టాలతో నిండిపోతే, నేత్రాలు కన్నీళ్లతో నిండిపోతే రహస్యంగా ప్రభువుతో మాట్లాడండి. అల్లాహ్‌కు మన కష్టాల గురించి తెలుసు. కానీ, వాటిని మన నుంచి వినాలనుకుంటాడు. అందుకే, కన్నీటి పొరల నుంచి దేవుణ్ని చూడాలంటారు ఉలేమాలు.
పాపభీతితో కార్చే రెండు కన్నీటి బొట్లు అంటే అల్లాహ్‌కు ఎంతో ప్రీతి. చెంపల పైనుంచి జాలువారే ఆ కన్నీరు భగభగమండే నరకాగ్నికీలల్ని చల్లారుస్తుందని ప్రవక్త మహనీయులు చెబుతారు. అల్లాహ్ భీతితో ఎవరైతే కన్నీళ్లు పెట్టుకుంటారో ఆ వ్యక్తిని నరకం నీడ కూడా తాకదని ఆయన సెలవిచ్చారు. మనం చేసే ప్రార్థన అల్లాహ్ స్వీకృతిని పొందింది అనడానికి నిదర్శనం దువా మధ్యలో కన్నీళ్లు రాలడమే! ప్రాపంచిక అవసరాలు తీరలేదని ప్రభువుకు మొరపెట్టుకొని ఏడ్వడంలో గొప్పదనం లేదు. మన కర్మల చిట్టాలో సత్కార్యాలు లేవనే ఆందోళనతో రోదించడమే నిజమైన ఆవేదన. అల్లాహ్ ఆజ్ఞలు భంగపరచినందుకు పడే బాధ పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. అది దైవ ప్రేమకు ఆనవాలుగా నిలుస్తుంది. మనం చేసిన పాపాల వల్ల హృదయానికి తుప్పు పడుతుంది. ఆ తుప్పును వదిలించే గుణం కేవలం పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లకే ఉందంటారు విశ్వాసులు. మనసును ప్రక్షాళన చేయగలిగిన కన్నీళ్లు ఎంతో విలువైనవి. వాటిని లౌకికమైన విషయాల కోసం కాకుండా… అల్లాహ్ ఆరాధనలో ఖర్చు చేద్దాం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

