Srisailam Temple | పరివార దేవతలకు ప్రత్యేక పూజలు
Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. బుధవారం క్షేత్రంలోని
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. బుధవారం క్షేత్రంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం జ్వాలా వీరభద్రుడికి ప్రదోషకాలంలో షోడషోపచార పూజలు చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు.

ఇదిలా ఉండగా.. దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ విరాళాల పథకానికి హైదరాబాద్‌కు చెందిన ఏవీఎస్ సురేశ్, డాక్టర్ అనురాధ దంపతులు రూ.10లక్షల విరాళం ఇవ్వగా.. చెక్కును సురేశ్ తల్లిదండ్రులు రమణమూర్తి, సుభద్ర ఈవో లవన్నకు అందజేశారు. రూ.3లక్షలు ఆగమ పాఠశాల నిర్వహణ, రూ.2లక్షలు గోశాల, రూ.2లక్షలు శాశ్వత అన్నదానం, రూ.50వేలు స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం కోసం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దంపతులకు స్వామిఅమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

