తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు
pushpa yagam | శ్రీవారి ఆలయంలో మంగళశారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని
తిరుమల : శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పుష్పయాగం సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను దేవస్థానం రద్దు చేసింది.
పుష్పయాగ మహోత్సవానికి సోమవారం రాత్రి శ్రీవారి ఆలయంలో అంకురార్పరణ చేశారు. మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9 గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

