ఆధ్యాత్మిక వసంతం.. ముహర్రం
కాలచక్రం మరోమారు తిరిగింది. నింగి వీధిలో నెలవంక నవ్వింది. ఇస్లామిక్ నూతన సంవత్సరానికి (హిజ్రీ కాలమానానికి) స్వాగతం పలుకుతూ ‘ముహర్రం’ మాసం ఆరంభమవుతున్నది. పవిత్రమైన మాసంగా అల్లాహ్ ఆశీర్వాదం పొందిన మాసమిది. ‘ముహర్రం’ అనే పదానికి ‘గౌరవప్రదమైనది’ అని అర్థం.
జూన్ 17 నుంచి ముహర్రం నెల ప్రారంభం
కాలచక్రం మరోమారు తిరిగింది. నింగి వీధిలో నెలవంక నవ్వింది. ఇస్లామిక్ నూతన సంవత్సరానికి (హిజ్రీ కాలమానానికి) స్వాగతం పలుకుతూ ‘ముహర్రం’ మాసం ఆరంభమవుతున్నది. పవిత్రమైన మాసంగా అల్లాహ్ ఆశీర్వాదం పొందిన మాసమిది. ‘ముహర్రం’ అనే పదానికి ‘గౌరవప్రదమైనది’ అని అర్థం. లోపలి కల్మషాలను కడిగేసుకుని, హృదయాన్ని దైవచింతనతో, సత్ప్రవర్తనతో నింపుకోవడానికి లభించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వసంతకాలం ఇది.
సాధారణంగా నూతన సంవత్సరం అంటే ఉల్లాసాలు, ఉత్సాహాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇస్లామిక్ క్యాలెండర్ ఒక మహోన్నతమైన త్యాగంతో, ఒక పవిత్రమైన ప్రయాణంతో మొదలవుతుంది. నాటి రోజుల్లో సత్య స్థాపన కోసం, ఆదర్శ సమాజ నిర్మాణం కోసం ప్రవక్త ముహమ్మద్ (స) తను పుట్టిన గడ్డ అయిన మక్కాను వదిలి మదీనాకు వలస (హిజ్రత్) వెళ్లారు. కష్టాల కడలిని దాటి, ఓర్పుతో సత్యాన్ని గెలిపించిన ఆ చారిత్రాత్మక ప్రస్థానమే ఈ నూతన సంవత్సరానికి నాంది. కాలం ఎంత వేగంగా పరిగెత్తుతున్నా.. సత్యం కోసం, ధర్మం కోసం చేసే త్యాగం ఎప్పటికీ అమరమేనని ఈ మాసం చాటిచెబుతుంది.
‘రమజాన్ మాసం తర్వాత అల్లాహ్ మాసమైన ముహర్రంలో ఉండే ఉపవాసమే అత్యున్నతమైనదని చెబుతారు ప్రవక్త.ముహర్రం మాసానికే తలమానికం.. 10వ రోజైన ‘ఆషూరా దినం’. ఈజిప్టు పాలకుడైన ఫిరౌన్ క్రూరమైన బానిసత్వం నుంచి ప్రవక్త మూసా (అలైహిస్ సలామ్), ఆయన అనుచరులను అల్లాహ్ అద్భుతంగా రక్షించిన రోజు ఇది. సముద్రాన్ని రెండుగా చీల్చి, సత్యానికి దారి చూపి, అన్యాయాన్ని అణచివేసిన పరమ పవిత్ర ఘట్టమిది. ఈ దైవిక విముక్తికి కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ మహనీయుని అడుగుజాడలను గౌరవిస్తూ, ముస్లింలు కూడా ఈ రోజున (ముహర్రం 9, 10 లేదా 10, 11 తేదీల్లో) ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. ఈ ఆషూరా ఉపవాసం గడిచిన సంవత్సరపు చిన్నపాటి పాపాలను సైతం ప్రక్షాళన చేస్తుందని ప్రవక్త ఉద్బోధ.
ముహర్రం మనకు అందించే సందేశం ఎంతో సరళమైనది, హృద్యమైనది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా, తెల్లవారుజామున వెలుగు రేఖలు రావడం ఎంత సహజమో.. జీవితంలో కష్టాలు ఎంతగా చుట్టుముట్టినా, దైవంపై నమ్మకం ఉంచితే ఉపశమనం లభించడం అంతకంటే సహజం. ఈ నూతన ఇస్లామిక్ సంవత్సరంలో ద్వేషాన్ని, క్రోధాన్ని విడనాడి.. ప్రేమ, కరుణ, సత్యం, మానవత్వాన్ని పంచుతూ మన జీవితాలను పరిమళింపజేసుకుందాం!
ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

