Srisailam | నంది వాహనంపై విహరించిన స్వామిఅమ్మవార్లు
Srisailam | మహాశివరాత్రి ( Maha Shivaratri ) బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభమై నంది మండపం వరకు సాగిన ప్రభలో వేలాది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ప్రభపై అర్చక వేదపండితులు కూర్చుని ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు, అక్షింతలు అందజేశారు. ప్రభోత్సవం ముందు కోలాటాలు, చెక్కభజనలు, సాంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఈవో లవన్న తెలిపారు.
నందివాహనంపై స్వామిఅమ్మవార్లు
ప్రభోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లు నందివాహనం సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లును వేంచుబజేసి షోడషోపచార పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయోత్సవంలో భాగంగా స్వామిఅమ్మవార్లు నందివాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉత్సవం ఆద్యంతం కళారూపాలతో ఆకట్టుకునేలా సందడిగా సాగింది.





Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

