రామరాజ్యంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా బహుమతులు పంపేవాడట రాముడు
ఒక మనిషికి ఉండే శక్తి ఎంతటిదో నిరూపించిన వాడు శ్రీరాముడు. తన జీవన యానంతో ప్రత్యక్షంగా కొందరికి, రామాయణ కావ్యంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన సకల గుణాభిరాముడు రామచంద్రుడు.
ఒక మనిషికి ఉండే శక్తి ఎంతటిదో నిరూపించిన వాడు శ్రీరాముడు. తన జీవన యానంతో ప్రత్యక్షంగా కొందరికి, రామాయణ కావ్యంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన సకల గుణాభిరాముడు రామచంద్రుడు. అందుకే ‘రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్’
– శ్రీరాముడిలా జీవితాన్ని కొనసాగించాలి, రావణుడిలా కాదు అనే ఉపదేశం మనకు వాఙ్మయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
కోసల రాజ్య ప్రజలందరూ తమ దైనందిన వ్యవహారాల్లో, పరస్పర సంభాషణల్లో శ్రీరాముడి ప్రస్తావనే పదేపదే తెచ్చేవారట. అంతఃపురంలో బాలరాముడికి ఏదైనా వేడుక జరిగితే.. ప్రజలంతా కూడా పండుగలా భావించి, తమ ఇంట సంబురాలు చేసుకునేవారట. శ్రీరాముడు గుణవంతుడు, రూపసౌందర్యవంతుడు, వీరుడు, దృఢవ్రతుడు, చిరునవ్వుతో- ప్రేమతో అందరితో ఆప్యాయంగా మెలిగేవాడు. కోపాన్ని జయించినవాడు, సామాన్యులనే కాదు.. రాక్షసులను, దేవతలను, ప్రకృతిలోని నదులను, వృక్షాలను కూడా ఆకర్షించగల తేజస్సు కలవాడు. ఆర్థిక వ్యవహారాల్లో, రాజ్యాధికార విషయాల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగనివాడు. తన పరాక్రమంతో దేవతలను కూడా జయించగల సమర్థుడు… ఇలా సకల సద్గుణవంతుడిగా రాముడు కీర్తిప్రతిష్ఠలు అందుకున్నాడు. తాను పొందిన ప్రతీ ఉపకారాన్ని
గుర్తుంచుకునేవాడు.
రామరాజ్యంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా.. ఖజానా నుంచి వారికి బహుమతులు పంపేవాడట రాముడు. అందుకే ఆయన సర్వజనామోదం పొందిన పాలకుడు అయ్యాడు. వానరులు, మహర్షులు, స్త్రీలు, పురుషులు, బాలురు అందరూ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా రాముడి వ్యక్తిత్వాన్ని, సత్యనిష్ఠను, ధర్మనిరతిని, ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కీర్తించేవారు. రామబాణంతో దెబ్బతిన్న మారీచుడు, ముక్కుచెవులు కోల్పోయిన శూర్పణఖ, యుద్ధభూమిలో చతికిలపడ్డ రావణుడు మొదలైన రాక్షస పరివారం కూడా రాముడి గుణాలను పొగిడిన వారే. శ్రీ రాముడి వ్యక్తిత్వం ఎంత ప్రసిద్ధి పొందిందంటే… యుగాలు దాటినా ఇప్పటికీ బిడ్డలకు జన్మనిచ్చే తల్లులు శ్రీరాముడి లాంటి గుణవంతుడే తమకు సంతానంగా రావాలని కోరుకుంటారు. కన్యలంతా తమకు రాముడి లాంటి భర్త దొరకాలని మొక్కుకుంటారు.
– సముద్రాల శఠగోపాచార్యులు 98483 73067
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

