అంధకారంపై హెచ్చరిక
దురదృష్టవశాత్తు, మనిషి తరచుగా ఈ కంటి చూపును కేవలం క్షణికమైన ఆకర్షణల వెంటే పరిగెత్తిస్తాడు. లౌకిక వ్యామోహంలో పడి, అంతిమ సత్యాన్ని మరిచిపోతాడు. అందుకే సురా అల్-ఖమర్ (54:39)లోని హెచ్చరిక గుండెను హెచ్చరిస్తుంది: ‘నా శిక్షను, నా హెచ్చరికలను రుచి చూడండి!’ ఈ మాటల్లో కేవలం ఆగ్రహం మాత్రమే లేదు.
- ఇస్లాం బోధ
దురదృష్టవశాత్తు, మనిషి తరచుగా ఈ కంటి చూపును కేవలం క్షణికమైన ఆకర్షణల వెంటే పరిగెత్తిస్తాడు. లౌకిక వ్యామోహంలో పడి, అంతిమ సత్యాన్ని మరిచిపోతాడు. అందుకే సురా అల్-ఖమర్ (54:39)లోని హెచ్చరిక గుండెను హెచ్చరిస్తుంది: ‘నా శిక్షను, నా హెచ్చరికలను రుచి చూడండి!’ ఈ మాటల్లో కేవలం ఆగ్రహం మాత్రమే లేదు. తన సేవకుడు నాశనమైపోకూడదనే అపారమైన ప్రేమ, తన వైపు తిరిగి రమ్మని చేసే కరుణామయమైన పిలుపు ఉంది. దైవం మనకు పదేపదే పంపుతున్న ఈ హెచ్చరికలు, మన జీవిత పడవను సక్రమ మార్గంలో నడిపించమని చెప్పే ప్రేమ లేఖలు.
వాటిని పెడచెవిన పెడితే, రుచి చూడాల్సిన బాధ మరింత తీవ్రంగా ఉంటుంది. మన జీవిత లక్ష్యం కేవలం ఊహాగానాల మీద, అపనమ్మకాల మీద ఆధారపడలేదు. అది యఖీన్ (నిశ్చిత జ్ఞానం) మీద ఆధారపడి ఉంది. సురా అత్-తకాసుర్ (102:7) లోని వాక్యం: ‘అవును! మీరు దానిని (నరకాన్ని) కచ్చితంగా కళ్లారా చూస్తారు సుమా!’ ఈ వాక్యం మనకు దృఢత్వాన్ని బోధిస్తుంది. నిజమైన దాసుడు కేవలం వినికిడి లేదా నమ్మకంతోనే సరిపెట్టుకోడు. ఈ లోకంలోనే తన హృదయ నేత్రంతో (ఐన్ అల్-యఖీన్) అంతిమ సత్యాన్ని, పరలోకాన్ని దర్శించినంత నిశ్చయంతో జీవిస్తాడు. ఈ నిశ్చయ దృఢత్వం ఉన్నప్పుడే, మన కర్మలు సన్మార్గంలో సాగుతాయి.
ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

