శివలింగం భిన్నమైతే..
గృహేగ్ని దగ్ధా భగ్నాశ్చ, నార్చ్యా పూజ్యా వసుంధరే ఏతాసాం పూజయేన్నిత్య, ముద్వేగం ప్రాప్నుయాద్గృహీ॥
శివలింగం భిన్నమైతే పూజించకూడదా?
రమణమూర్తి మొకరాల, ఈసీఐఎల్
శివం అంటే శుభప్రదమైనదనీ, లింగం అంటే సంకేతమనీ అర్థం. శివలింగం అంటే సకల శుభప్రదమైన దైవానికి ప్రతిరూపం. సత్త్వ, రజో, తమో గుణాలకు అతీతమైన వాడు శివుడు. ఆ దైవాన్ని ఏ గుణాలూ అంటుకోవు.
గృహేగ్ని దగ్ధా భగ్నాశ్చ, నార్చ్యా పూజ్యా వసుంధరే
ఏతాసాం పూజయేన్నిత్య, ముద్వేగం ప్రాప్నుయాద్గృహీ॥
అగ్ని వల్ల దగ్ధమైన ప్రతిమలను గానీ, భిన్నమైన విగ్రహాలను గానీ పూజించ రాదని శాస్త్రం. దీన్ని గమనించకుండా గానీ, తెలియక గానీ ఆ ప్రతిమలను పూజిస్తే సమస్యలు వస్తాయని పై శ్లోకానికి అర్థం. ఇదే నియమం శివలింగాలకూ వర్తిస్తుంది. దేవాలయాల్లో శివలింగం భిన్నమైతే.. దానిని మంత్రిత జలాలతో అభిషేకించి, శాంతి పూజలు నిర్వహించి లింగాన్ని తొలగించాలి. దానిని ఓంకార నాదం చేస్తూ నదిలో నిమజ్జనం చేయాలి. దాని స్థానంలో మరో శివలింగాన్ని శాస్ర్తోక్తంగా పునఃప్రతిష్ఠ చేయాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. కాబట్టి పగుళ్లు వచ్చిన లేదా శిథిలమైన శివలింగానికి పూజలు చేయకూడదని నియమం.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Lingam
- lord shiva
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

