గురువు ఔదార్యం
ఒకానొక బౌద్ధాశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆరామంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉంటుండేవారు. గురువు రోజూ వారికి పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో తోటపని చేయిస్తూ ఉండేవాడు.
ఒకానొక బౌద్ధాశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆరామంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉంటుండేవారు. గురువు రోజూ వారికి పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో తోటపని చేయిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆరామంలో దొంగతనం జరిగింది. అక్కడే చదువుకుంటున్న ఓ విద్యార్థి దొంగతనం చేసినట్టు రుజువైంది. మిగతా విద్యార్థులంతా గురువుతో అతణ్ని ఆశ్రమం నుంచి పంపించి వేయాల్సిందిగా కోరారు! గురువు మౌనంగానే కుదరదు అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. విద్యార్థులు నిరాశగా తమ గదుల్లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆశ్రమంలో మరోసారి దొంగతనం జరిగింది. గతంలో చోరీకి పాల్పడిన విద్యార్థే మళ్లీ దోషిగా తేలాడు.
విద్యార్థులు ఈసారి గురువుతో ‘అతణ్ని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టాల్సిందే!’ అని తీవ్రస్వరంతో చెప్పారు. అయినా గురువు స్పందించలేదు. మర్నాడు విద్యార్థులంతా గురువుకు ఒక లేఖ రాశారు. దొంగతనానికి పాల్పడుతున్న విద్యార్థిని ఆశ్రమం నుంచి తొలగించకపోతే.. తామంతా వెళ్లిపోతామని ఆ లేఖ సారాంశం. గురువు దాన్ని చదివి విద్యార్థులతో.. ‘మీరంతా తెలివైన వారు. ఏది మంచో, ఏది చెడో తెలిసినవారు. ఎక్కడికి వెళ్లినా బతకగలరు. కానీ, ఆ కుర్రాడు అమాయకుడు. తప్పుదారిలో పయనిస్తున్నాడు. నా అవసరం మీకన్నా అతనికే ఎక్కువ ఉంది. కాబట్టి అతను ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఉండటం కష్టంగా ఉంటే మీరంతా ఆశ్రమం నుంచి బయల్దేరొచ్చు’ అన్నాడు. గురువు ఔదార్యానికి శిష్యులు ఆశ్చర్యపోయారు. అలాంటి గురువు నీడలో ఉండటమే తమకు శ్రేయస్కరం అని భావించారు. దొంగతనానికి పాల్పడుతున్న విద్యార్థిని తమలో చేర్చుకున్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

