TTD | ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమల : తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి,
పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు.

Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

