రైతన్నల భక్తి వేడుక ఏరువాక యజ్ఞం

‘ఏరువాక’ పండుగ లేదా ‘హలపౌర్ణమి’గా భారతీయులు జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకొంటారు. నాగరికత ఎంత ముందుకు సాగినా ప్రజలకు రైతు, నాగలి లేనిదే పూట గడవదు. సాగుకు సంబంధించిన అతిముఖ్యమైన వేడుక ఈ ‘ఏరువాక’.
ఇప్పటికి తొలకరి వర్షం కురుస్తుంది కనుక నాగలితో సాగే వ్యవసాయ పనులకు శుభారంభమిది. ఇవి ఎవరికివారు వీలైనప్పుడు మొదలుపెడితే ఫలితాలుకూడా తారుమారవుతాయి. కనుక, ఆ వేళ రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసుకొని, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఎడ్లకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, కాళ్ళకు గజ్జెలు కట్టి పసుపు కుంకుమలతో పూజించి హారతి పడతారు. ‘పొంగలి ప్రసాదం’ నైవేద్యంగా పెట్టి వాటికి తినిపిస్తారు. ఆ మూగజీవాలపట్ల తమ అనుబంధాన్ని రైతన్నలు ఇలా తెలియజేస్తారు.
దీనిని ‘జేష్ఠ పౌర్ణమినాడే ఎందుకు జరుపుకోవాలి?’ అంటే, ఈవేళ పదహారు కళలతో చంద్రుడు వెలుగొందుతాడు. భూమిలో ఎక్కడైతే ఔషధాలు, భూసారం, శక్తి ఉంటాయో అక్కడికి ‘వెన్నెల కిరణాలు’ వెళ్లి లోపలి మొక్కకు వాటిని అందిస్తాయి. ఏరువాక, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో ఒక విశిష్టస్థానం ఉంది. మన దేశంలో వేదకాలంలోనూ ఈ పండుగ ఆచరణలో ఉంది. గోపాలకులకు ‘గిరియజ్ఞం’, బ్రాహ్మణులకు ‘మంత్రజప యజ్ఞం’, కర్షకులకు ‘ఏరువాక యజ్ఞం’ ఆచరణీయమని ‘విష్ణుపురాణం’ పేర్కొంది. సాగుకు మూలమైన ఎద్దును దైవసమానంగా భావించిన పరమేశ్వరుడు దానినే తన వాహనంగా చేసుకొన్నాడు కదా.
వేముగంటి శుక్తిమతి
99081 10937
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Eruvaka
- farmers
- farmers fest
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

