మీరు ఎవరికైనా గురువుగా ఉన్నారా?
మాతృభావన, పితృభావన ఉన్నట్టే, మనలో ప్రతి ఒక్కరిలోనూ కొంత గురుభావం కూడా ఉంటుంది. తెలిసో, తెలియకో మీరు ఎవరో ఒకరికి గురువుగా ఉంటున్నారు.
మాతృభావన, పితృభావన ఉన్నట్టే, మనలో ప్రతి ఒక్కరిలోనూ కొంత గురుభావం కూడా ఉంటుంది. తెలిసో, తెలియకో మీరు ఎవరో ఒకరికి గురువుగా ఉంటున్నారు. మీరు సలహాలు ఇచ్చారు, ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. వారికి మీ ప్రేమను, అభిమానాన్ని అందించారు. ఇంతకూ (జీవితంలో) గురువు పాత్ర ఏమిటి?
గురువుగా ఉండటం అంటే, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ఇతరుల ఎదుగుదలకు, అభివృద్ధికి మీరు చేయగలిగినదంతా చేయడం. మీ మనసులో స్పష్టతతో, స్వచ్ఛమైన హృదయంతో కనీసం ఒక్కరికైనా మీరు ఈవిధంగా సహాయం చేశారా? గురువుగా మీ పాత్రను పోషించారా? ఎదుటివారినుంచి ఏ ప్రతిఫలమూ ఆశించకుండా వారికి మార్గం చూపుతున్నపుడు, గురుతత్వం మీద్వారా పనిచేస్తున్నదని గుర్తించండి. పరమాత్మ, ఆత్మ, గురువు- వీరి మధ్య భేదం లేదు. అందరూ ఒక్కటే.
లౌకికమైన కోరికలను తీర్చడం గురువు పని కాదు. మీ అసలైన లక్ష్యం ముక్తి. దానిపైనే దృష్టి ఉంచి పనిచేస్తున్నపుడు ఈ లౌకిక అవసరాలన్నీ ఏమాత్రం శ్రమ పడకుండానే సమకూరుతాయి. ఆ లక్ష్యాన్ని పొందడం గురువు లేనిదే సాధ్యం కాదు. గురువు మాత్రమే మీలోని అంతఃసౌందర్యాన్ని, అంతర్జ్యోతిని గుర్తించేలా చేయగలడు.
ఉపనిషత్తుకు అసలైన అర్థం
గురువు జ్ఞాన స్వరూపుడు. సంస్కృతంలో, ఉపనిషత్ అంటే గురువుకు దగ్గరగా కూర్చోవడం, ధ్యాసను పూర్తిగా గురువుపైనే ఉంచడం. పరిమితమైన (జ్ఞానం) అనంతత్వానికి దగ్గరగా చేరడం, తెలిసిన (పరిమితమైన) జ్ఞానం, తెలియని (అపరిమితమైన) జ్ఞానాన్ని చేరుకోవడం. నిజమైన జ్ఞాన మార్గంలో నడిచిన అనేకమంది మహాత్ములు శరణాగతితో, భక్తితో జీవితపు అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమని మనకు నిరూపించారు. వారి జీవితాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. గురుశిష్యుల మధ్య తరతరాలుగా జరుగుతున్న సంభాషణలే ఉపనిషత్తులు. విశ్వంలో అనేక స్థాయులలో వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాల నేపథ్యంలో, జ్ఞాన స్వరూపుడైన గురువుకు మానసికంగా దగ్గరవడం ఎవరికైనా ఎలా సాధ్యం?
మూడు రకాలైన శాంతి
ఇందుకోసం మొదటగా మనం శాంతిని ఆవాహన చేస్తాం. శాంతి ఉన్నప్పుడే విద్యార్థులు జ్ఞానానికి చేరువ అవుతారు. అపనమ్మకం, సందేహం ఉంటే, (గురుశిష్యుల మధ్య) జ్ఞానం ప్రసరించలేదు. కాబట్టి ఉపనిషత్తులన్నీ మూడు రకాలైన శాంతిని కోరే ప్రార్థనతో ప్రారంభమవుతాయి. ‘ఓం శాంతి, శాంతి, శాంతి’- మనం భౌతిక స్థాయిలో, ఆలోచనలు, భావోద్వేగాల్లో, చివరకు అంతరంగంలో శాంతిని పొందుదాం. పరమాత్మ మనలను రక్షించి, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా, శాంతిగా కలిసి ఉందుము గాక.
దేవుడికి నువ్వు కావాలి
భగవంతుడి కన్నా భక్తుడు ఉన్నతుడు. నిజానికి, గురుశిష్యులు ఇద్దరూ భగవత్ స్వరూపాలే. భక్తుని కీర్తిని గానం చేయడానికి, తద్వారా భక్తుని స్థాయిని పెంచేందుకు భగవంతుడే స్వయంగా కిందికి దిగివస్తాడు. తండ్రి తన కొడుకును తన కంటే ఎత్తుగా భుజంపై ఎక్కించుకుని మోస్తున్నట్లుగా చెప్పవచ్చు. హనుమంతుడు.. శ్రీరాముడి కంటే బలవంతుడు కాకపోతే, శ్రీరాముడికి ఎలా సహాయం చేసేవాడు? కాబట్టి, హనుమంతుడు శ్రీరాముడికి సహాయం చేశాడు, కానీ తాను శ్రీరాముడికి సహాయం చేస్తున్నాననే గర్వానికి ఎన్నడూ చోటివ్వలేదు. అలాంటి ఆలోచనలు కేవలం భ్రమ మాత్రమేనని, తనకున్న బలం శ్రీరాముడి నుంచే వచ్చిందని హనుమకు తెలుసు.
అదే విధంగా, దేవుడు కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాడు. భగవంతుడి పని చేసేవాడు సమాజ హితం కోసం పనిచేస్తాడు. అలా పనిచేసేవారి కోసం భగవంతుడు శ్రద్ధ వహిస్తాడు. భగవంతుడి కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం అనేది మీలో దైవత్వం వికసిస్తుందనడానికి సూచన. దీన్ని గుర్తించడం, మీ జీవితంలో మీకు లభించిన వాటన్నిటికీ కృతజ్ఞులై ఉండటం.. ఈ ఎరుకకు, ఈ జ్ఞానాన్ని సంరక్షించిన గురు పరంపరకు కృతజ్ఞతలు సమర్పిస్తూ, చేసుకునే ఉత్సవమే గురు పౌర్ణమి.
– గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

