దేవుని ప్రవక్త!
అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేసి చీకటి పడ్డాక నడుం వాల్చాడు.
అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేసి చీకటి పడ్డాక నడుం వాల్చాడు. అంతలో అటుగా వచ్చిన యజమాని బిలాల్ నిద్రపోవడం చూసి గొడ్డును బాదినట్టు బాదాడు. కనీసం కనికరం చూపకుండా ఒంటిపై ఉన్న కంబళి, దుస్తులను కూడా లాక్కొని పిండి విసరాలని ఆజ్ఞాపించాడు. బిలాల్ చలికి గజగజ వణికిపోతున్నా కనికరించలేదు.
మరో మార్గంలేక నగ్నంగా బార్లీ గింజలను విసుర్రాయిలో వేసి విసరసాగాడు. అదే సమయంలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అటుగా వచ్చారు. బిలాల్‌ను చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావ్? ఏం కష్టమొచ్చింది?’ అని అడిగారు. దానికి బిలాల్ ‘నీ పని నువ్వు చూసుకో. అందరూ అడిగేవారే! సాయానికి ఎవరూ ముందుకు రారు’ అని నిష్టూరమాడాడు. అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రవక్త కాసేపటికి ఒక చేతిలో వేడి పాల చెంబు, మరో చేతిలో ఖర్జూరాలు తీసుకొని అక్కడికి వచ్చారు. బిలాల్‌కు వాటినిచ్చి తృప్తిగా పండ్లుతిని, పాలు తాగమన్నారు.
‘పని ఆపితే యజమాని నన్ను చంపేస్తాడు’ అన్నాడు బిలాల్. ‘నీ పని నేను చేస్తాను. నువ్వు తిని విశ్రాంతి తీసుకో’ అన్నారు ప్రవక్త. తెల్లవారేసరికి పిండంతా విసిరి బిలాల్‌కు అప్పజెప్పి వెళ్లిపోయారు ప్రవక్త. ఇలా మూడు రాత్రులు గడిచాయి. మరుసటి రోజు ఉదయం ప్రవక్త వెళ్తుండగా బిలాల్ ఆయన్ను ఆలింగనం చేసుకున్నాడు. ‘సమాజం మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నది. మీపై బురదజల్లుతున్నది. బానిసల పట్ల ఇంతటి దయ చూపే మీరు నిజంగా దేవుని ప్రవక్త అని విశ్వసిస్తున్నాను’ అని ప్రకటించాడు బిలాల్. నాటి నుంచి ప్రవక్త మార్గంలో ప్రయాణిస్తూ తన జీవితాన్ని పునీతం చేసుకున్నాడు.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

