పరోపకారః పుణ్యాయ..
‘నిత్యపూజలు, వ్రతాలు, హోమాదులు, తపస్సులు మేము చేయలేం. మా వల్ల కాదు’ అనేవారు ఈ నాలుగు విషయాలు తెలుసుకొని ఆచరిస్తే కొంత మేలు. ముందు ఎలా మాట్లాడాలో తెలియడం మంచిది. ‘మాకు మాట్లాడటం రాదా! మేము చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కదా’ అనకండి. భావం ఒకటే అయినా మాట్లాడే పద్ధతిలో తేడా ఉంటుంది. ‘భగవద్గీత’లో శ్రీ కృష్ణుడు ఏమన్నాడో చూద్దాం.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే॥

- భగవద్గీత (17-15)
ఉద్వేగాన్ని కలిగించని మాటలు, సత్యములు, కోపం పుట్టించనివి, ప్రియహితమైనవి, నిత్య వేదశాస్ర్తాల పఠనం- ఇవీ వాక్కుకు సంబంధమైన తపో లక్షణాలు. ఇలా మాట్లాడమే ‘వాచిక తపస్సు’. మన మాటల వల్ల ఇతరుల మనసు గాయపడితే మనకు పాపం. హితం, ప్రియం కలిగించే మాటలు పుణ్యప్రదం. కొన్నిసార్లు నిజం చెప్పడం కన్నా అబద్ధం చెప్పినా తప్పు లేదంటారు పెద్దలు. కఠోరమైన సత్యం కన్నా ప్రియమైన అసత్యమూ ఒక్కోసారి మంచిది. 84 కోట్ల జీవరాశిలో ఒక్క మానవునికే మాట్లాడే భాగ్యమిచ్చాడు ఆ సృష్టికర్త. కాబట్టి, మన మాటలు వినేవారికి సంతోషం కలిగించాలి. లేకపోతే మౌనంగానైనా ఉండాలి. లంకలో సీతమ్మకు రావణుని వల్ల ఎంతో కష్టం కలిగి ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటుంది. అప్పుడు రాముని కథ వినిపించి సీతమ్మకు ఊరట కలిగించాడు ఆంజనేయస్వామి. ఇలా ఆయన మాటల వల్ల అమ్మవారి ప్రాణాలు నిలిచాయి. ‘అన్ని ధర్మాలలోకెల్లా ఏది ఉత్తమ ధర్మం?’ అన్నప్పుడు, ఉత్తమ ధర్మాన్ని ధృతరాష్ర్టునికి విదురుడు ఇలా వివరించాడు. ‘ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకు కష్టం కలుగుతుందో అలాంటి పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైంది’.
‘చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు జేసి పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ వినురవేమ’.
‘చంపవలసినటువంటి శత్రువు మనకు దొరికినా అతనిని చంపకూడదు. మంచి చేసి విడిచి పెడితే చాలు, అది అతనికి చావుతో సమానం’ అన్నారు యోగి వేమన. మనం పడ్డ మాటలు, కష్టాలు మరలా మనం ఇతరులకు కలిగించకుండా ఉండటమే ధర్మం. ‘రోడ్డు మీద మన పొరుగువారు చెత్త వేస్తున్నారు, మేం వేస్తే తప్పా?’ అనకూడదు. ‘మా ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటున్నారు. నేను చేస్తే తప్పేమిటి?’ అనరాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది. అధర్మం, అబద్ధం, మోసం, ద్రోహం అందరూ చేశారని మనమూ చేస్తే మనకు ‘రాజదండన’ పడుతుంది. ఒకవేళ దానిని తప్పించుకుంటే ‘యమదండన’కు తప్పక గురవుతాం. ఎవరూ చూడకపోయినా గుప్తంగా (గుండెలోనే) కూర్చొని చిత్రంగా మన తప్పొప్పుల చిట్టా సిద్ధం చేస్తుంటాడు చిత్రగుప్తుడు.
‘ఏది పాపం, ఏది పుణ్యం?’ అనే ప్రశ్నకు వ్యాసభగవానుడు ఒక్క వాక్యంలో ఇలా చెప్పారు, ‘పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనం’. అంటే, పరులకు మేలు చేస్తే పుణ్యం, కీడు చేస్తే పాపం. పుణ్యం చేయకపోయినా ఫరవాలేదు, పాపం చేయకుండా ఉంటే అదే మేలు. కాబట్టి, దేవుడు మనకు నోరిచ్చినందుకు నాలుగు మంచి మాటలు మాట్లాడటం మొదటి పని. కుదిరితే భగవంతుని గురించీ మాట్లాడండి. ‘పరులకు కీడు చేయడం వల్ల పాపం, మేలు చేస్తే అదే పుణ్యం’ అని తెలుసుకొని, ‘మనకు కలిగిన కష్టాన్నో, మోసాన్నో ఇతరులకు మనం కలిగించకుండా ఉండటం’.. ఇవి చేయగలిగితే ఎంతో జీవితంలో ధన్యులమవుతాం.
లంక శివరామకృష్ణ శాస్త్రి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Chinthana News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

