ఇవి ప్రేరణగా మాత్రమే!
వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కామ్యాల కోసం చేసే జపతపాలు, హోమాలు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించవచ్చా? కామ్యం నెరవేరడంతో ఈ జప ప్రభావం తీరిపోతుందా వివరించండి?
వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కామ్యాల కోసం చేసే జపతపాలు, హోమాలు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించవచ్చా? కామ్యం నెరవేరడంతో ఈ జప ప్రభావం తీరిపోతుందా వివరించండి?
– శివాజీ, ఆదిలాబాద్
ఏదైనా ఓ కోరిక తీరడం కోసం దైవానుగ్రహాన్ని కోరుతూ మనం చేసే జపం, పూజలు, హోమాలు మొదలైనవన్నీ కామ్యకర్మల కోవలోకి వస్తాయి. ఇవి కేవలం ఆయా కోరికలు తీరడం కోసం, దైవికమైన శక్తిని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలే తప్ప ఆధ్యాత్మిక సాధనగా వీటిని భావించకూడదు. మోక్షం కోసం పరితపిస్తూ అందుకు అవసరమైన మార్గాన్ని అన్వేషిస్తూ చేసే ఆరాధనా ప్రక్రియే సాధన అవుతుంది. ధ్యానం, భక్తి, జపం, నామ స్మరణ.. మొదలైన వాటితో మనసులో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు సాధన దోహదం చేస్తుంది. ఈ క్రమంలో భౌతికమైన, లౌకికమైన కోరికలకు ప్రాధాన్యం ఉండదు. లౌకిక భావనలు ఉన్నంతకాలం మనసు మోక్షం వైపు ఆలోచించదు. అప్పుడది ఆధ్యాత్మిక సాధన అనిపించుకోదు.
మన కోసం, మన సంస్కారాల శుద్ధి కోసం, ఎన్నో జన్మల నుంచి వస్తున్న రాగద్వేషాలు, సంచిత పాపాల నుంచి విముక్తి పొందడం సాధన ఆంతర్యం. ఇలా కాకుండా కోరికలు నెరవేరడం కోసం చేసే క్రియలను ఆధ్యాత్మిక ప్రయత్నాలుగా భావించాలి తప్ప, సాధనగా పరిగణించొద్దు. అయితే, ధర్మబద్ధమైన కోరికలు తీరడం కోసం చేసే జపతపాలు క్రమంగా మనిషిని అలౌకిక మార్గంలోకి తీసుకెళ్లడానికి ప్రేరణనిస్తాయి.
భవిష్యత్తులో చేయబోయే ఆధ్యాత్మిక సాధనకు ఇవి కొంతవరకు పునాదిగా నిలుస్తాయి. రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, దంభం, దర్పం, అహంకారం, ఇచ్ఛ, భక్తి, శ్రద్ధ.. ఇవన్నీ మనసుకు చెందిన వృత్తులు. వీటిలో ‘శ్రద్ధ, భక్తి’ తప్ప మిగిలినవన్నీ మలిన వృత్తులు. ఇవి మనిషిని పాపకర్మల వైపు ప్రోత్సహిస్తాయి. వీటివల్ల మనిషి పతనమవుతాడు. ఈ మలిన వృత్తులను నిరోధించడం కోసం, శుద్ధ వృత్తులైన భక్తి, శ్రద్ధలను అలవాటు చేసుకోవాలి. అదే ఆధ్యాత్మిక సాధనకు బీజం వేస్తుంది.
– శ్రీ భారతి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

