అంతరంగ శుద్ధికి.. నమాజ్!
జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగుల ప్రయాణం మాత్రమే కాదు.. అలసిన ఆత్మకు ప్రశాంతత చేకూర్చే ఆధ్యాత్మిక సౌరభం కూడా! నేటి యాంత్రిక జీవనంలో మనం శరీరానికి ఇచ్చే ప్రాధాన్యం మనసుకి, ఆత్మకి ఇవ్వడం లేదు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు ‘ప్రార్థన’ అంతకంటే ఎక్కువ అవసరం. నమాజ్ అంటే కేవలం కొన్ని కదలికల సమాహారం కాదు.. అది సృష్టికర్తతో మన మనసు చేసే సంభాషణ.
- ఇస్లాం బోధ
జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగుల ప్రయాణం మాత్రమే కాదు.. అలసిన ఆత్మకు ప్రశాంతత చేకూర్చే ఆధ్యాత్మిక సౌరభం కూడా! నేటి యాంత్రిక జీవనంలో మనం శరీరానికి ఇచ్చే ప్రాధాన్యం మనసుకి, ఆత్మకి ఇవ్వడం లేదు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు ‘ప్రార్థన’ అంతకంటే ఎక్కువ అవసరం. నమాజ్ అంటే కేవలం కొన్ని కదలికల సమాహారం కాదు.. అది సృష్టికర్తతో మన మనసు చేసే సంభాషణ.
ఆధ్యాత్మిక వారధి
అరబిక్ భాషలో నమాజ్‌ను ‘అస్-సలాహ్’ అంటారు. దీనికి ‘అనుబంధం’ అని అర్థం. అంటే, అల్లాహ్‌తో బంధాన్ని బలపరుచుకునే మార్గం. రోజుకు ఐదుసార్లు మనం చేసే ప్రార్థన, సృష్టికర్తతో మనల్ని నేరుగా కలుపుతుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతూ ‘ఒక వ్యక్తి సజ్దా (సాష్టాంగ నమస్కారం)లో ఉన్నప్పుడు తన ప్రభువుకు అత్యంత సమీపంలో ఉంటాడు. ఆ క్షణంలో అహంకారం నశిస్తుంది, వినయం జనిస్తుంది’ అంటారు.
క్రమశిక్షణకు మారుపేరు
ఇస్లాం ధర్మంలో ప్రార్థన రెండో ప్రధానమైన స్తంభం. యుద్ధ రంగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ప్రార్థనకు మినహాయింపు లేదు. అంటే, జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా దైవస్మరణ వీడకూడదని దీని అర్థం. కేవలం 24 గంటల్లో ఒక అరగంట సమయాన్ని దైవానికి కేటాయించడం అంటే.. మనల్ని మనం సంస్కరించుకోవడమే!
ప్రార్థనతో కలిగే ప్రయోజనాలు
చెడు నుంచి రక్షణ: మనిషి బలహీనుడు. కానీ, మనస్ఫూర్తిగా ప్రార్థించే వ్యక్తిని అల్లాహ్ చెడు పనుల నుంచి, అనైతికత నుంచి రక్షిస్తాడు.
ఆత్మకు శాంతి: ‘అల్లాహ్ స్మరణతోనే హృదయాలకు శాంతి చేకూరుతుంది’ అని ఖురాన్ చెబుతున్నది. ఒత్తిడితో నిండిన మనసుకి నమాజ్ ఒక దివ్యౌషధం.
సమానత్వ సందేశం: మసీదులో ప్రార్థన చేసేటప్పుడు ధనిక, పేద, కుల, మత, వర్ణ వివక్షలు ఉండవు. అందరూ భుజం భుజం కలిపి ఒకే వరుసలో నిలబడతారు. ఇది విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనం.
పాప ప్రక్షాళన: ఇంటి ముందు పారే నదిలో రోజుకు ఐదుసార్లు స్నానం చేస్తే శరీరంపై మురికి ఎలా ఉండదో, ఐదు పూటల నమాజ్ చేసే మనిషిలోని పాపాలు అలాగే తొలిగిపోతాయి.
సాకులు వద్దు..
చాలామంది ‘సమయం లేదు’, ‘పని ఒత్తిడి’ అని సాకులు చెబుతుంటారు. కానీ, మనకు ప్రాణం పోసిన దేవుడి కోసం రోజులో కొద్ది నిమిషాలు కేటాయించలేకపోవడం కృతజ్ఞతారాహిత్యమే అవుతుంది. ప్రార్థన అల్లాహ్ కోసం కాదు, మన క్షేమం కోసం! అది మనల్ని క్రమశిక్షణ గలవారిగా, సహనం గలవారిగా మారుస్తుంది.
జీవితం అనే ప్రయాణంలో గమ్యం చేరాలంటే ప్రార్థన అనే ఇంధనం అవసరం. ప్రార్థన మనల్ని దైవానికి దగ్గర చేయడమే కాకుండా, తోటి మనుషులను ప్రేమించే గుణాన్ని అలవరుస్తుంది. కాబట్టి, ఆ సృష్టికర్త పిలుపునకు స్పందిద్దాం.. ప్రార్థనతో మన జీవితాలను వెలిగించుకుందాం!
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

