నేటి అలంకారం.. బాలాత్రిపుర సుందరి
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుందరి’గా పూజిస్తారు.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుందరి’గా పూజిస్తారు. బాల అంటే చిన్నపిల్ల. ముద్దులొలికే బాలిక ఇంట్లో అందరినీ ఆకర్షిస్తుంది. ఏడాది నుంచి ఐదేండ్ల వయసున్న చిన్నారుల మీద చంద్రుడి ఆధిపత్యం ఉంటుందట. చంద్రుడి చల్లదనం కూడా వారి ముఖంలో ప్రస్ఫుటమవుతుంది.
చంద్రుడు మనసుకు కారకుడు. అందుకే చిన్నపిల్లల మనసు కూడా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆరు నుంచి పదేండ్ల వయసున్న పిల్లలను గంధర్వుడు ఆవహించి ఉంటాడు. ఈ వయసు ఆడపిల్లలు అందంగా కనిపిస్తారు. వారి చూపుల్లో, మాటల్లో ఎలాంటి వికార భావాలూ ఉండవు. లలితాదేవి నవ వర్ష స్వరూపమే బాలాత్రిపుర సుందరి రూపం. బాల అనే మాట జ్ఞానశక్తిని సూచిస్తుంది. బాల్యదశలో మేధాశక్తి బలంగా ఉంటుంది. బాలాత్రిపుర సుందరి ఉపాసనే సాధకులకు తొలి సోపానంగా చెబుతారు. ఆ తల్లి మంత్రంతోనే చాలామంది దేవీ ఉపాసకులు తమ ఆధ్యాత్మిక ప్రస్థానం ప్రారంభిస్తారు.
అమ్మ రూపాన్ని హృదయంలో, మంత్రాన్ని కంఠంలో, జ్ఞానాన్ని శిరస్సులో నిలుపుకోవాలి. ఇవి త్రిపురాలు. సత్వం, రజస్సు, తమస్సు ఈ మూడూ త్రిపురాలు. భక్తి, జ్ఞానం, ప్రవృత్తి ఇవి కూడా త్రిపురాలే. మానవ శరీరంలోని షట్చక్రాల్లో ప్రధానమైనవి ఆజ్ఞాచక్రం, స్వాధిష్ఠానం, సహస్రారం.. ఈ మూడిటినీ త్రిపురాలుగా చెబుతారు. వీటన్నిటినీ సంస్కరించే దేవత బాల.
అందుకే ఆమె బాలాత్రిపుర అయింది. సుందరి అంటే పోయిన వస్తువును తిరిగి ఇచ్చేది అని అర్థం. అంటే, పోయిన జ్ఞానాన్ని, అర్థంకాని తతాన్ని, కలగాల్సిన మోక్షాన్ని ఇచ్చే దేవత కాబట్టి ఆమె బాలాత్రిపుర సుందరి అయింది. నవరాత్రుల్లో తొలి వేలుపుగా పూలందుకునే బాలాత్రిపుర సుందరీదేవి సృజనాత్మక శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించే దేవత. ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో అక్షమాల ధరించి, వరద, అభయ హస్తాలతో అభీష్టాన్ని నెరవేరుస్తుందీ అమ్మవారు. అరుణవర్ణంతో శోభిల్లే బాల ఉపాసనతో మూలాధారం ఉత్తేజితం అవుతుంది. అక్షయమైన జ్ఞానం కలుగుతుంది.
– వేముగంటి శుక్తిమతి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

