శ్రీశైలంలో ఆషాఢ పౌర్ణమి పూజలు

శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో ఆషాఢమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు శాస్తోక్తంగా ఘనంగా జరిగినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు నిర్వహించి వార పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి లక్ష కుంకుమార్చన అదేవిధంగా ఊయల సేవను జరిపారు. అమ్మవారి ఆలయ ప్రాకారమంతా ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా మారింది. ఊయలలో ఆశీనులైన స్వామి అమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్రనామ పఠనంతో కుంకుమార్చన చేశారు.
లోకకళ్యాణార్ధం ప్రతి పౌర్ణమి రోజున మాత్రమే అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే లక్షకుంకుమార్చన పూజా విధిలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించగా వివిధ ప్రాంతాల నుండి ఈ సేవలో భాగస్థులైన 721 మంది గొత్రనామాలను అర్చకులు పఠించారు. దేశ విదేశాలలో ఉండే భక్తుల అభ్యర్థన మేరకు అమ్మవారికి జరిగే పౌర్ణమి ప్రదోషకాల పూజల్లో పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించిన దేవస్థానం నిర్ణయానికి పలువురు దాతలు హర్షం వ్యక్తం చేసినట్లు ఈవో తెలిపారు. పూజా కార్యక్రమంలో వేదపండితుడు రాధాకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు విజయ్ కుమార్, శాస్త్రి, ఫని, పవన్, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్ కుమార్, ఏఈవో హరిదాసు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

