కరెంట్ మీటర్?
తెలుగులో... సంసారం, పెద్దకొడుకు, మేమూ మనుషులమే తదితర చిత్రాలతోపాటు తమిళంలోనూ నటించిన సీనియర్ నటి ఒకరు ఇటీవల కన్నుమూశారు. ఆమె ఎవరు? టీ20 క్రికెట్ ఫార్మాట్లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 633 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. అతను ఎవరి రికార్డును బద్దలు కొట్టాడు?
- మీ జీకే.. ఓకేనా?
- తెలుగులో… సంసారం, పెద్దకొడుకు, మేమూ మనుషులమే తదితర చిత్రాలతోపాటు తమిళంలోనూ నటించిన సీనియర్ నటి ఒకరు ఇటీవల కన్నుమూశారు. ఆమె ఎవరు?
- టీ20 క్రికెట్ ఫార్మాట్లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 633 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. అతను ఎవరి రికార్డును బద్దలు కొట్టాడు?
- ఇటీవల న్యూజిలాండ్ ప్రభుత్వం ఆ దేశంలోని 2,518 మీటర్ల ఎత్తయిన పర్వతానికి వ్యక్తిగా గుర్తింపునిస్తూ చట్టం చేసింది. దాని పేరేంటి?
- దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఆప్తుడైన వ్యక్తి టాటా మోటార్స్‌లో స్ట్రాటజిస్ట్ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పేరేంటి?
- ఆటోమేషన్ సాయంతో అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల్లో వృథా ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ఏర్పాటైంది. ఈ విభాగంలో నియమితుడైన భారత సంతతి యువకుడు ఎవరు?
- అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ అమెరికా ఖండంలోని ఓ ప్రాంతం వలసదారులు అగ్రరాజ్యం వెళ్లడానికి ఉపయోగించేదిగా వార్తలు వచ్చాయి. అది ఏది?
- దక్షిణాఫ్రికా జట్టు ఆటగాడు ఒకరు తన తొలి మ్యాచ్‌లోనే 150 పరుగులు చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ అతను రికార్డు సృష్టించాడు. అతనెవరు?
- ఆఫ్రికా ఖండ దేశం నమీబియాకు పొరుగు దేశం దక్షిణాఫ్రికా నుంచి స్వాతంత్య్రం తెచ్చిన యోధుడు, ఆ దేశ తొలి అధ్యక్షుడు ఫిబ్రవరి 8న మరణించారు. ఆ నాయకుడు ఎవరు?
- పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బ్రిటిష్ వాళ్లు 1696లో ఫోర్ట్ విలియం కోటను కట్టారు. ఇప్పుడిది భారత సైన్యం తూర్పు కమాండ్ ప్రధాన కేంద్రం. తాజాగా దీనిపేరును ఏమని మార్చారు?
- కోతి అంటే అల్లరి పనులని అందరికీ గుర్తున్నదే. ఇటీవల ఓ దేశంలో ఒకే ఒక్క వానరం కారణంగా దేశమంతటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఏదేశంలో..?
జవాబులు
1. పుష్పలత (87)
2. వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో (631 వికెట్లు)
3. మౌంట్ తారానాకీ
4. శంతను నాయుడు
5. ఆకాశ్ బొబ్బ (ఇది ఎలాన్ మస్క్ నేతృత్వంలో నడుస్తుంది.)
6. డేరియన్ గ్యాప్ (కొలంబియా పనామా దేశాల మధ్య ఉంది)
7. మాథ్యూ బ్రీట్జ్కె
8. సామ్ నుజోమా (95, నమీబియా జాతిపితగా ప్రసిద్ధుడు)
9. విజయ్ దుర్గ్
10. శ్రీలంక
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

