యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా.?
యువకుడి దారుణ హత్య | నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దోసపాటి వెంకటయ్య అతడిని వీధిలో అడ్డగించి గొడ్డలితో నరికి హతమార్చాడు.

నల్లగొండ : నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దోసపాటి వెంకటయ్య అతడిని వీధిలో అడ్డగించి గొడ్డలితో నరికి హతమార్చాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడు వెంకటయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని ఎస్ఐ వీరబాబు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

