పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి వాట్సాప్‌లో చేరిన అమ్మాయి నగ్న ఫొటో.. అప్పుడుకానీ అమ్మాయికి నిజం తెలియలేదు!
Women founds she was assaulted 6 months ago | ఒక అబ్బాయి వచ్చి ఆమెను చూసుకున్నాడు. అతనికి ఆమె నచ్చింది కూడా. ఓకే చెప్దామనుకుంటుండగా అతనికి వాట్సాప్‌లో ఒక ఫొటో వచ్చింది. అది ఆ అమ్మాయి నగ్న ఫొటో..

Women founds she was assaulted 6 months ago | చూడచక్కగా ఉన్న ఆ అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అలా ఒక అబ్బాయి వచ్చి ఆమెను చూసుకున్నాడు. అతనికి ఆమె నచ్చింది కూడా. ఓకే చెప్దామనుకుంటుండగా అతనికి వాట్సాప్‌లో ఒక ఫొటో వచ్చింది. అది ఆ అమ్మాయి నగ్న ఫొటో.
ఇది చూసిన అతను షాకైపోయాడు. ఈ విషయం అమ్మాయికి తెలిసింది. ఆ ఫొటో చూడగానే జరిగిన ఘోరం ఆ అమ్మాయికి అర్థమైంది. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తన కజిన్తోపాటు మరో ఇద్దరు తనపై గ్యాంగ్ రేప్ చేసినట్లు కేసు పెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని దిబ్రూగఢ్‌లో వెలుగు చూసింది.
అసలేమైందని ఆమెను అడగ్గా పోలీసులకు అసలు విషయం చెప్పిందామె. ఆరు నెలల క్రితం వరకూ తన కజిన్‌తో కలిసి కాలేజీకి వెళ్లేదామె. అలాగే ఒకరోజు కాలేజీకి వెళ్తుండగా వాళ్ల బైక్ చెడిపోయింది. దీంతో సదరు కజిన్ వాళ్ల చుట్టాలబ్బాయికి ఫోన్ చేయగా అతను కారులో వచ్చాడు.
ముగ్గురూ కలిసి ఆ కారులో ఉండగా ఆమెకు కూల్‌డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె స్పృహకోల్పోయింది. కళ్లు తెరిచే సరికి ఒక గదిలో ఉన్నట్లు ఆమె గుర్తించింది. బయటకు వచ్చి చూస్తే తన క్లాస్మేట్ కజిన్తోపాటు వాళ్ల చుట్టాలబ్బాయి, మరో యువకుడు ఉన్నారు. అయితే స్పృహలేని సమయంలో తనపై జరిగిన అఘాయిత్యం ఆమెకు తెలియలేదు.
ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పిందామె. తనకు మత్తిచ్చి ముగ్గురూ కలిసి గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆమె అనుమానం వెలిబుచ్చింది. ఆ తర్వాత తన నగ్న ఫొటోలు తీసుకొని ఉంటారని పేర్కొంది. ఈ ఫొటోలు చాలా మంది వద్దకు చేరాయి. అలా చేరిన వారిలో కొందరు ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారు.
ఈ విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని, ఇలా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఆమె కజిన్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని, మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. యువతని వైద్య పరీక్షల కోసం పంపించినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

