Khammam | మతిస్థిమితం లేని భార్య.. ఇంట్లోనే భర్త మృతదేహంతో మూడు రోజులు
Khammam | మతిస్థిమితం లేని ఓ మహిళ తన భర్త చనిపోయాడన్న విషయం గ్రహించలేదు. భర్త చనిపోయి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన శవంతో ఇంట్లోనే ఉండిపోయింది. మృతదేహం ఉబ్బి దుర్వాసన వెదజల్లినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుంటూ గడిపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కొణిజెర్లలో వెలుగు చూసింది.
Khammam | మతిస్థిమితం లేని ఓ మహిళ తన భర్త చనిపోయాడన్న విషయం గ్రహించలేదు. భర్త చనిపోయి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన శవంతో ఇంట్లోనే ఉండిపోయింది. మృతదేహం ఉబ్బి దుర్వాసన వెదజల్లినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుంటూ గడిపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కొణిజెర్లలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రైల్వే మాజీ ఉద్యోగి బీ వీరభద్రం(65), తన భార్య మంగమ్మతో కలిసి శాంతి నగర్లో నివాసం ఉంటున్నాడు. వీరభద్రం పెద్ద కుమారుడు వెంకట కృష్ణ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాగా, ఖమ్మం పట్టణంలో నివసిస్తున్నాడు. మరో కుమారుడు, కుమార్తె హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. తండ్రి అనారోగ్యానికి గురికావడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో వెంకటకృష్ణ ప్రతి రోజు వారికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారు. అయితే ఏప్రిల్ 6వ తేదీన వెంకట కృష్ణ ఫోన్ చేసినప్పటికీ తండ్రి సమాధానం ఇ్వలేదు. తల్లినే ఫోన్లో ఏదో మాట్లాడి పెట్టేసింది.
ఇక నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో వెంకట కృష్ణ శాంతినగర్ చేరుకున్నాడు. బెడ్రూంలో మంచంపై ఉబ్బి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి కుమారుడు షాక్ అయ్యాడు. వీరభద్రం తలకు గాయం కావడంతోనే మరణించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుమారులు, కుమార్తె, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

