Cyber Fraud | ఫేక్ పార్సిల్ స్కామ్‌లో రూ. 7.9 లక్షలు పోగొట్టుకున్న మహిళ
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు. ఇక తాజాగా ఫేక్ పార్సిల్ స్కామ్‌లో 33 ఏండ్ల మహిళ ఏకంగా రూ. 7.9 కోట్లు నష్టపోయారు. కర్నాటకలోని ఉడుపికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నమ్రతను స్కామర్లు ఫెడ్ఎక్స్, ముంబై పోలీస్ అధికారులుగా నమ్మబలుకుతూ మోసగించారు.
జూన్ 22న నమ్రతకు ఫెడ్ఎక్స్ ఉద్యోగి అని చెబుతూ సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాల్ చేశాడు. బాధితురాలి చిరునామాకు అనుమానాస్పద పార్సిల్ బుక్ చేశారని చెప్పాడు. ఈ పార్సిల్లో ఐదు ఇరాన్ పాస్‌పోర్ట్‌లు, డెబిట్ కార్డులు, 150 గ్రాముల మాదకద్రవ్యాలు ఉన్నాయని నమ్మబలికాడు.
ముంబై పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పాడు. ఆపై ముంబై పోలీస్ అధికారి అంటూ మరో వ్యక్తి ఆమెకు కాల్ చేశాడు. స్కైప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని స్కామర్లు ఆమెను కోరారు. ఆపై పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో ఆమె నుంచి రూ. 7.9 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :
Mega DSC | మెగా డీఎస్సీ ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

