షాకింగ్ : పిల్లలతో పాటు తానూ నిద్రమాత్రలు మింగి మహిళ బలవన్మరణం!

ముంబై : ఇద్దరు పిల్లలతో పాటు మహిళ మోతాదు మించి నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. ఏడాది కిందట భర్తతో విడిపోయిన మహిళ (46) నగరంలోని మిరా రోడ్డులోని జుహి నరేంద్ర బిల్డింగ్లో తన తండ్రితో కలిసి ఉంటోంది. మహిళకు ఒక కొడుకు (13) కుమార్తె (21) ఉన్నారు. పిల్లలు కూల్డ్రింక్ బాటిల్ కోసం గొడవకు దిగడంతో మనస్ధాపానికి గురైన మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
పిల్లలు ఘర్షణ పడగా కుటుంబ సభ్యులు సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అందరూ నిద్రకు ఉపక్రమించగా తెల్లారి మహిళ తండ్రి నిద్రలేచి చూడగా ఇంటిలో ముగ్గురు విగతజీవులుగా పడిఉండటంతో ఆయన షాక్కు గురయ్యారు. ఘటనా స్ధలాన్ని సందర్శించిన పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం దవాఖానకు తరలించారు. ఘటన జరిగిన ప్రదేశంలో నిద్రమాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళ తండ్రి షాక్లో ఉన్నాడని ఆయన తేరుకున్నాక ఇంటరాగేషన్ చేపడతామని పోలీసులు తెలిపారు. పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చని అందుకే నిద్ర మాత్రలు వాడుతున్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

