Whats App | వాట్సాప్‌లో భారీ డేటా చోరీకి పాల్పడ్డ హ్యాకర్.. 5 కోట్ల మంది ఫోన్ నంబర్లు అమ్మకానికి
మనదేశంలో 61.62 లక్షల మంది వాట్సాప్ యూజర్ల డేటా చోరీ
Whats App : వాట్సాప్ యూజర్లకు ఊహించని షాక్.. ఒక హ్యాకర్ వాట్సాప్‌లో భారీ స్థాయిలో డేటా చోరీకి పాల్పడ్డాడు. దాదాపు 5 కోట్ల మంది ఫోన్ నంబర్లను హ్యాక్ చేయడమే కాకుండా వాటిని అమ్మకానికి పెట్టాడు. ఇందులో 84 దేశాలకు చెందిన యూజర్ల వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికా, ఈజిప్టు, బ్రిటన్, ఇటలీ, భారతదేశం, సౌదీ అరేబియా, టర్కీ, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల యూజర్ల నంబర్లు ఉన్నాయని సైబర్‌క్రైమ్ న్యూస్ నివేదిక తెలిపింది.
మనదేశంలో 61.62 లక్షల మంది, అమెరికాలో 3.2 కోట్లు, ఈజిప్ట్‌లో 4.5 కోట్లు, ఇటలీ 3.5 కోట్ల మంది డేటాను చోరీ చేశాడు. సౌదీ అరేబియాలో 2.9 కోట్లు, ఫ్రాన్స్‌లో 2 కోట్లు , టర్కీలో 2 కోట్ల వాట్సాప్ డేటాను హ్యాకర్ చోరీ చేశాడు. రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందన కోటి మంది వాట్సాప్ యూజర్ల డేటాను దొంగిలించాడు.
ఆ హ్యాకర్ 3.2 కోట్ల యూజర్ల నంబర్లు ఉన్న అమెరికా డేటా సెట్‌ను 7వేల డాలర్లకు, 1.1 కోట్ల యూజర్ల నంబర్లు ఉన్న యూకే డేటా సెట్‌ను 2,500 డాలర్లకకు అమ్మకానికి పెట్టాడు. అతను ఇంత పెద్దమొత్తంలోవాట్సాప్ యూజర్ల డేటాను ఎలా సేకరించాడు అనేది మాత్రం తెలియలేదు. ఫిషింగ్ అటాక్స్ చేసేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది అని సైబర్ క్రైమ్ న్యూస్ వెల్లడించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

