లోయలోపడిన వ్యాన్.. ఐదుగురు దుర్మరణం
ఐదుగురు దుర్మరణం | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.

గాంధీనగర్ : గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. రాజ్పిపాల్ పట్ణణంలోని ఓ పరిశ్రమలో పనిచేసే కార్మికులు తమ విధులు ముగించుకొని వ్యాన్లో స్వగ్రామం నట్రాంగ్కు బయల్దేరారు.
వందర్వెళ్లి గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ట్రక్కు అదుపుతప్పి వేగంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిలో నలుగురు మహిళలేనని పోలీసు తెలిపారు. మృతులు, క్షతగాత్రులంతా భరూచ్ జిల్లాకు చెందిన వారేనని బీకే పంచానీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండానే పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన ట్రక్కు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- 10 injured
- 5 died
- Bharuch
- Gujarat
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

