యాదాద్రి జిల్లాలో దారుణం.. యువతి గొంతుకోసి పరారైన ఆగంతకులు
యదాద్రి భువనగిరి : మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకులు కత్తితో దాడి చేశారు. ఆ యువతి గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎలుగు యమున వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యమునపై మాస్క్ ధరించి బైక్‌పై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు కత్తితో ఆమె గొంతు కోశారు. క్షణాల్లోనే అక్కడ్నుంచి ఆ ఇద్దరు పరారీ అయ్యారు. బాధితురాలి కేకలు, అరుపులు విని ఇరుగు పొరుగు వారు అప్రమత్తమయ్యారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. యువతిపై దాడి ఘటన సమాచారం తెలుసుకున్న మోత్కూర్ ఎస్సై వి జానకి రామ్ రెడ్డి సిబ్బందితో దత్తప్పగూడెం గ్రామాన్ని సందర్శించారు. యువతిపై దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

