ఉస్మానియా యూనివర్సిటీ : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మీర్జాల్గూడ బస్టాప్‌లో గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 65) మృతి చెంది పడిఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అనారోగ్యం, చలి కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి సంబంధీకులు లాలాగూడ పోలీస్ స్టేషన్ లో గాని, 9491491334, 9490616451 ఫోన్నెంబర్లలోగాని సంప్రదించాలని సూచించారు.